తెలంగాణ

telangana

Dravid coach: టీమ్​ఇండియా కోచ్​గా ద్రవిడ్.. 2023 ప్రపంచకప్​ వరకు

By

Published : Oct 16, 2021, 9:35 AM IST

భారత క్రికెట్​ జట్టు కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్(dravid coach). ఈ విషయం దాదాపు ఖరారైనప్పటికీ, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ద్రవిడ్(dravid news).. టీమ్​ఇండియాను ఏ స్థాయికి తీసుకెళ్తాడో చూడాలి?

Rahul Dravid coach
రాహుల్ ద్రవిడ్

దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్.. టీమ్​ఇండియా కోచ్​గా(dravid coach) బాధ్యతలు స్వీకరించడం ఇక లాంఛనమే. ప్రస్తుత కోచ్​గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం.. త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్​తో పూర్తవుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్​ పర్యటనతో ద్రవిడ్​.. కోచ్​గా బాధ్యతలు అందుకుంటాడని 2023 వన్డే ప్రపంచకప్​ వరకు ఉంటాడని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

రాహుల్ ద్రవిడ్

48 ఏళ్ల ద్రవిడ్(dravid news).. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్​ అకాడమీ డైరెక్టర్​గా కొనసాగుతున్నాడు. గత ఆరేళ్ల నుంచి అండర్-19 ప్రపంచకప్​ కోసం కుర్రాళ్లు సానబెడుతూ తన మార్క్​ చూపించాడు. వాటిలో ఆడిన పృథ్వీషా, పంత్​, గిల్, శ్రేయస్ అయ్యర్ లాంటి క్రికెటర్లు ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఇప్పుడు ద్రవిడ్​ కోచ్​గా వస్తుండటం, ఆటగాళ్లతో పాటు జట్టుకూ లాభించే అంశం.

రవిశాస్త్రి తర్వాత కోచ్​ ఎవరు అని ఆలోచన వచ్చినప్పుడు చాలామంది పేర్లు ప్రస్తావనలోకి వచ్చాయి. కానీ బీసీసీఐ మాత్రం స్వదేశీ వ్యక్తి కోచ్​గా ఉండాలని భావించింది. ఈ క్రమంలోనే ద్రవిడ్​(dravid coach) పేరు తెరమీదకు వచ్చింది. అయితే అతడు తొలుత అంగీకారం తెలపలేదు. కానీ బీసీసీఐ(bcci news) అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా.. దాదాపు మూడుసార్లు తర్వాత ఒప్పించారు!

రాహుల్ ద్రవిడ్

రోహిత్ శర్మ వచ్చే ఏడాది 35లోకి అడుగుపెడతాడు. కోహ్లీకి 33 ఏళ్లు. అజింక్య రహానె, ఇషాంత్ శర్మ, మహ్మమద్ షమి, పుజారా, ఇషాంత్​ శర్మ తదితరులు మహా అయితే ఇంకో రెండేళ్లు మాత్రమే జట్టులో కొనసాగుతారు. దీంతో యువ క్రికెటర్లకు అవకాశాలు వచ్చే అవకాశముంది. ఈ సమయంలో ద్రవిడ్(dravid coach)​ కోచ్​గా రావడం టీమ్​ఇండియాకే కాకుండా యువ ఆటగాళ్లకు లాభంగా మారనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details