ETV Bharat / sports

ICC T20 World Cup 2021: భారత జట్టులో మార్పులా?

author img

By

Published : Sep 30, 2021, 1:22 PM IST

టీ20 ప్రపంచకప్​(ICC T20 World Cup 2021) కంటే ముందు టీమ్ఇండియాలో కొన్ని మార్పులు(Changes in Team India) జరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వీటిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్​ ధుమాల్​ స్పందించారు. ఐపీఎల్​లో(IPL 2021) పేలవ ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లను ఉంచుతారా తీసేస్తారా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు.

BCCI Treasurer Arun Dhumal Rubbishes Rumours, Says 'No Changes in India T20 World Cup Squad'
ICC T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్​లో భారత జట్టు మార్పు?

ఐసీసీ టీ20 ప్రపంచకప్​(ICC T20 World Cup 2021) ప్రారంభానికి మరో 17 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మెగాటోర్నీకి 15 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు రిజర్వ్​ క్రికెటర్లను బీసీసీఐ ఎంపిక(India Team in T20 World Cup) చేసింది. అయితే జట్టులో స్థానం దక్కించుకున్న ఇషాన్​ కిషన్​, సూర్య కూమార్​ యాదవ్​, హర్దిక్​ పాండ్య వంటి యువ ఆటగాళ్ల ఐపీఎల్ ప్రదర్శన పేలవంగా ఉండడం వల్ల వారి స్థానంలో మార్పులు జరిగే అవకాశం ఉందని ఇటీవలే వార్తలొచ్చాయి.

టీ20 ప్రపంచకప్​ జట్టులో స్థానం లభించిన తర్వాత సదరు ఆటగాళ్లలో నిర్లక్ష్యం పెరిగిందని కొందరు నెటిజన్లు పోస్ట్​లు పెడుతున్నారు. ఇదే కారణంగా ఐపీఎల్​లో(IPL 2021) పేలవ ప్రదర్శన చేసిన వారిని జట్టు నుంచి తప్పించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై బీసీసీఐ కోశాధికారి(BCCI Treasurer Arun Dhumal) అరుణ్​ ధుమాల్​ స్పందించారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ ముందు టీమ్ఇండియా జట్టులో మార్పులేవి జరగవని భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) కోశాధికారి అరుణ్​ ధుమాల్​ స్పష్టం చేశారు. "టీ20 ప్రపంచకప్​ జట్టులో కొన్ని మార్పులు జరగనున్నాయని కొన్ని వార్తలు వచ్చాయి. మార్పులు ఉంటాయని మీకు ఎవరు చెప్పారు?" అని అరుణ్​ అన్నారు.

శ్రీలంక పర్యటనతో(India Tour of Sri Lanka 2021) పాటు ప్రస్తుత ఐపీఎల్​లోనూ కొంతమంది యువ క్రికెటర్లు రాణిస్తున్నారు. వారికి టీ20 ప్రపంచకప్​ జట్టులో స్థానం దక్కలేదు. ఉదాహరణకు ఆర్సీబీ స్పిన్నర్​ చాహల్​.. ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​తో పాటు శ్రీలంక పర్యటనలోనూ అద్భుతంగా రాణించాడు. కానీ, అతడికి జట్టులో స్థానం కల్పించకపోవడంపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​(Sehwag on Chahal) కూడా బీసీసీఐని ప్రశ్నించాడు.

ఇదీ చూడండి.. Harshal Patel News: ఈ బౌలర్​ ప్రదర్శనతో ఆర్సీబీ దశ తిరిగేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.