తెలంగాణ

telangana

పంజాబ్, సన్​రైజర్స్​ గుస్సా.. లఖ్​నవూ జట్టుపై ఫిర్యాదు!

By

Published : Nov 30, 2021, 10:49 AM IST

PBKS and SRH Complaint: పంజాబ్ కింగ్స్, సన్​రైజర్స్​ హైదరాబాద్ జట్లు కొత్త ఫ్రాంఛైజీ లఖ్​నవూపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. తమ జట్టు కీలక ఆటగాళ్లను కొత్త ఫ్రాంఛైజీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఇరు జట్లు పేర్కొన్నాయని అన్నారు.
kl rahul, rashid
కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్

PBKS and SRH Complaint: ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ త్వరలోనే జరగనుంది. ఈ మేరకు 8 ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను మంగళవారం(నవంబర్ 30) సమర్పించాలని బీసీసీఐ తెలిపింది. అయితే.. వచ్చే ఏడాది ఐపీఎల్​లో పోటీ పడేందుకు రెండు కొత్త జట్లు కూడా సిద్ధమవుతున్నాయి.

ఈ మెగా వేలం నేపథ్యంలో పంజాబ్ కింగ్స్​ జట్టు సారథిగా వ్యవహరించిన కేఎల్ రాహుల్(KL Rahul PBKS), సన్​రైజర్స్​ హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్(Rashid Khan SRH) తమ ఫ్రాంఛైజీలతో కొనసాగలేమని చెప్పేసినట్లు సమాచారం. అయితే.. లఖ్​నవూ ఫ్రాంఛైజీ ఈ ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ముందుగానే వారిని కలిసిందని తెలిసింది. ఈ క్రమంలో తమ ఆటగాళ్లను కొత్త ఫ్రాంఛైజీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని పీబీకేఎస్, ఎస్​ఆర్​హెచ్​ జట్లు ఫిర్యాదు చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

"తమ జట్టు ఆటగాళ్లను లఖ్​నవూ ఫ్రాంఛైజీ మభ్యపెట్టేందుకు ప్రయత్నించిందని పంజాబ్ కింగ్స్, ఎస్ఆర్​హెచ్​లు ఫిర్యాదు చేశాయి. లిఖితపూర్వక కంప్లైంట్​ మాత్రం ఇంకా ఇవ్వలేదు. కానీ, దీనిపై దర్యాప్తు చేస్తున్నాం. ఇది నిజమని తెలిస్తే.. కొత్త ఫ్రాంఛైజీపై కఠిన చర్యలు తీసుకుంటాం." అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల వివరాలను సమర్పించకముందే ఇలా ఆటగాళ్లను కలవడం బీసీసీఐ తప్పుగానే పరిగణిస్తుందని అధికారి స్పష్టం చేశారు. ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా ఉండే ప్రసక్తేలేదని అన్నారు.

సన్​రైజర్స్​ ఫ్రాంఛైజీ తనని నంబర్ 1 రిటెన్షన్ ఆటగాడిగా తీసుకుంటేనే ఆ జట్టులో కొనసాగుతానని అఫ్గానిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్ చెప్పినట్లు సమాచారం. మరోవైపు పంజాబ్​ కింగ్స్​ కేఎల్​ రాహుల్​తో ఇంకా చర్చలు జరుపుతోందని తెలిసింది.

ఇదీ చదవండి:

IPL 2022 Mega Auction: గత సీజన్లో అధిక ధర.. ఈసారి ఎంత పలుకుతారో?

IPL Retention 2022: రిటెన్షన్​కు వేళాయే.. ఏ జట్టు ఎవరిని తీసుకునేనో?

ABOUT THE AUTHOR

...view details