తెలంగాణ

telangana

'వాళ్లకు స్పిన్‌ పిచ్‌ల అవసరం లేదు - అలా చేస్తే బలాన్ని తగ్గించినట్లవుతుంది'

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 7:20 AM IST

Jonny Bairstow on India Vs England : ఐదు రోజుల టెస్ట్ సిరీస్​ కోసం భారత్​తో తలపడేందుకు ఇంగ్లాండ్ జట్టు తరలి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సిరీస్ కోసం సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఇంగ్లాండ్‌ వికెట్‌కీపర్‌ జానీ బెయిర్‌స్టో భారత బౌలర్ల గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఆ విశేషాలు మీ కోసం

Jonny Bairstow on India Vs England
Jonny Bairstow on India Vs England

Jonny Bairstow on India Vs England : సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం టీమ్ఇండియా తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే తుది జట్టు విషయంలో సందిగ్ధత నెలకొనప్పటికీ జట్టు సభ్యులు ప్రాక్టీసులో నిమగ్నమైపోయారు. అయితే తాజాగా ఈ సిరీస్​ కోసం టీమ్ఇండియా సిద్ధం చేసిన స్పిన్​ గురించి ఇంగ్లీష్​ జట్టు సీనియర్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేశాడు. ఈ మ్యాచుల కోసం భారత జట్టు అన్నీ స్పిన్‌ పిచ్‌లే తయారు చేస్తుందని ఆయన భావించడం లేదని జానీ అభిప్రాయ పడ్డాడు. ప్రస్తుతం భారత పేస్‌ బౌలింగ్‌ దళం కూడా చాలా పటిష్టంగా ఉందని, అన్నీ స్పిన్‌ పిచ్‌లే ఉంటే వారి ఎఫెక్ట్​ తగ్గిపోతుందని బెయిర్‌స్టో అభిప్రాయపడ్డాడు.

" భారత పేస్‌ బృందం ఎంత ప్రమాదకరంగా ఉందో ఈ మధ్యనే చూశాం. పూర్తిగా స్పిన్‌ పిచ్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఆ జట్టుకు లేదు. భిన్నమైన పిచ్‌లపై దృష్టి సారించొచ్చు. ఏదేమైనప్పటికీ అక్కడ స్పిన్‌ పిచ్‌లే ఎదురవుతాయన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. తొలి రోజు నుంచే స్పిన్‌కు అనుకూలిస్తాయా లేదా అన్న విషయాన్ని పక్కనపెడితే స్పిన్‌ పిచ్‌ల వల్ల ఆ జట్టు పేస్‌ బలాన్ని తగ్గించినట్లవుతుంది" అని జానీ చెప్పుకొచ్చాడు.

మరోవైపు భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య అయిదు టెస్టుల సిరీస్‌ ఈ నెల 25న హైదరాబాద్‌లో ఆరంభం కానుంది. అయితే తమతో పాటు ఇంగ్లీష్ జట్టు మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌కు చెందిన చెఫ్‌ ఒమర్‌ మెజైన్​ను తీసుకుని వస్తున్నారు. ఆ చెఫ్​ భారత పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ ప్లేయర్లకు వండి పెట్టనున్నాడు.

"భారత పర్యటనకు ఇంగ్లాండ్‌ తన సొంత చెఫ్‌ను రప్పిస్తోంది. ఏడు వారాల పాటు ఇండియాలోనే ఇంగ్లిష్‌ జట్టు ఉంటుంది. హైదరాబాద్‌లో జనవరి 25 జరగనున్న తొలి టెస్టు సమయానికి చెఫ్‌ ఒమర్‌ మా జట్టుతో చేరుకుంటాడు. అతడు ప్లేయర్లకు నచ్చిన ఫుడ్​ను వండి పెడతాడు’’ అంటూ ఈసీబీ వర్గాలు తాజాగా తెలిపాయి. అయితే 2022లో పాకిస్థాన్‌ పర్యటనలోనూ ఒమర్‌ ఇంగ్లాండ్‌ జట్టుతో వెళ్లాడు.

ఏకైక టెస్ట్ మ్యాచ్​లో టీమ్ఇండియాదే పైచేయి- 347పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ చిత్తు

ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేశాక విండీస్‌ వికెట్‌కీపర్‌ సంచలన నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details