తెలంగాణ

telangana

IPL 2023 CSK VS DC : సీఎస్కే సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్స్​కు అర్హత.. వార్నర్​ పోరాటం వృథా

By

Published : May 20, 2023, 7:20 PM IST

Updated : May 20, 2023, 7:52 PM IST

ఐపీఎల్ 2023లో భాగంగా ప్లే ఆఫ్స్​కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై చెన్నై సూపర్​ కింగ్స్ విజయం సాధించింది. ఆ మ్యాచ్ వివరాలు..

Delhi Capitals vs Chennai Super Kings 67th Match
IPL 2023 CSK VS DC : దిల్లీపై విజయం.. ప్లేఆఫ్స్​కు సీఎస్కే

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 2023 సీజన్‌ లీగ్‌ స్టేజ్‌ ముగింపు దశకు చేరింది. నేడు డబుల్‌ హెడ్డర్స్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌- దిల్లీ క్యాపిటల్స్ జట్లు తమ చివరి లీగ్‌ మ్యాచ్​లో తలపడ్డాయి. అయితే ప్లే ఆఫ్స్​కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్ విజయం సాధించింది. బ్యాటింగ్​, బౌలింగ్​లో అద్భుతంగా రాణించిన సీఎస్కే.. 77 పరుగులు తేడాతో భారీ విజయం సాధించి ప్లే ఆఫ్స్​ బెర్త్​ ఖరారు చేసుకుంది.

224 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్​ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 20ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ వార్నర్​(50 బంతుల్లో 86; 7x4, 5x6 ) ధనాధన్​ ఇన్నింగ్స్ వృథా అయిపోయింది. యశ్​ ధుల్​(13), అక్సర్​ పటేల్​(15) నామమాత్రపు స్కోరు చేశారు. చెన్నై బౌలర్ల దెబ్బకు పృథ్వీ షా (5), ఫిలిప్‌ సాల్ట్‌ (3), రొసో (0), అమన్ ఖాన్ (7), లలిత్ యాదవ్ (6), నోకియా (0), కుల్‌దీప్‌ యాదవ్‌ (0) అందరూ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్​ 3 వికెట్లతో మెరవగా.. మహీశ్​ తీస్ఖానా, మథీషా ఫథిరానా తలో రెండు వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్​పాండే, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్(50 బంతుల్లో 79; 3x4, 7x6), డెవాన్​ కాన్వేలు(52 బంతుల్లో 87; 11x4x 3x6) అర్ధశతకాలతో మెరవగా.. చివర్లో శివమ్‌ దూబే,(9 బంతుల్లో 22; 3x6) రవీంద్ర జడేజా(7 బంతుల్లో 20*; 1x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్​, నోకియా, చేతన్​ సకారియా తలో వికెట్ తీశారు.

మొదటి క్వాలిఫయర్​ ఖాయమే.. ఈ సీజన్​లో ఎనిమిదో విజయాన్ని ఖాతాలో వేసుకుని ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించింది సీఎస్కే. ఫలితంగా ఐపీఎల్ హిస్టరీలో 12వ సారి ప్లేఆఫ్స్ ఆడనుంది ధోనీ సేన. అలానే ఈ జట్టు మొదటి క్వాలిఫైయర్ ఆడడం దాదాపు ఖాయమైపోయింది! 77 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న సీఎస్కే.. 17 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్‌తో మొదటి క్వాలిఫైయర్ ఆడే ఛాన్స్ ఉంది. చెన్నై క్వాలిఫైయర్ ఆడకుండా ఆపాలంటే లఖ్​నవూ సూపర్ జెయింట్స్.. కేకేఆర్‌పై 100+ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఔరా అనిపించే ఫ్లైయింగ్ క్యాచ్​.. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై ప్లేర్​ అంబటి రాయుడు.. అదిరిపోయే క్యాచ్ పట్టాడు. పృథ్వీషా బాదిన బంతిని అద్భుతమైన ఫ్లైయింగ్‌ క్యాచ్‌ పట్టి ఔరా అనిపించాడు. దీనిని సీఎస్కే తమ సోషల్​మీడియా ట్విట్టర్​ వేదికగా పోస్ట్ చేసింది.

ఇదీ చూడండి:IPL 2023 CSK VS DC : అది ధోనీ క్రేజ్​.. బౌలర్లు భయపడాల్సిందే!

Last Updated : May 20, 2023, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details