IPL 2023 CSK VS DC : అది ధోనీ క్రేజ్​.. బౌలర్లు భయపడాల్సిందే!

author img

By

Published : May 20, 2023, 6:15 PM IST

IPL 2023 CSK VS DC first innigs score

IPL 2023 CSK VS DC : దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న కీలక మ్యాచ్​లో మ్యాచ్​ సీఎస్కే తమ ఇన్నింగ్స్​ను ముగించింది. అయితే ఈ ఇన్నింగ్స్​లో రుతురాజ్‌ గైక్వాడ్, డెవాన్​ కాన్వే, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా మెరుపు ఇన్నింగ్స్​తో పాటు ధోనీ హైలైట్​గా నిలిచాడు.

ఐపీఎల్ 16వ సీజన్​లో భాగంగా ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన కీలక మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై తమ ఇన్నింగ్స్​ను ముగిసింది చెన్నై సూపర్ కింగ్స్​. నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులు చేసి​ దిల్లీ ముందు 224 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ పోరులో ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్(50 బంతుల్లో 79; 3x4, 7x6), డెవాన్​ కాన్వేలు(52 బంతుల్లో 87; 11x4x 3x6) హాఫ్​ సెంచరీలతో మెరవగా.. చివర్లో శివమ్‌ దూబే,(9 బంతుల్లో 22; 3x6) రవీంద్ర జడేజా(7 బంతుల్లో 20*; 1x6) విలువైన ఇన్నింగ్స్‌ ఆడి మెరుపులు మెరిపించారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్​, నోకియా, చేతన్​ సకారియా తలో వికెట్ తీశారు.

అయితే మ్యాచ్‌లో మాత్రం వీరందరీ ఆటతో పాటు మరో అంశం హైలైట్​గా నిలిచింది. అదే సీఎస్కే కెప్టెన్​ ధోనీ ఆటతీరు. ఆడింది ఐదు బంతులే.. చేసింది నాలుగు పరుగులే.. కానీ స్టేడియం మొత్తం ధోనీ నామస్మరణతో దద్దరిల్లిపోయింది. మ్యాచ్‌ జరిగేది దిల్లీలోనే అయినా అభిమానుల మద్దతు చెన్నైవైపే నిలిచింది. ఎందుకంటే ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్​ ఎప్పుడో ప్లేఆఫ్స్​ రేసు నుంచి వైదొలిగింది. అందుకే స్టాండ్స్‌ అంతా.. చెన్నై జెర్సీలతో కనువిందు చేశాయి.

ఒత్తిడిలో బౌలర్లు.. వాస్తవానికి సీఎస్కే మ్యాచ్​ అంటేనే.. ధోనీ బ్యాటింగ్​ను చూసేందుకు భారీగా తరలివస్తారు అభిమానులు. స్టేడియం మొత్తం అరుపులు, కేకలు వేస్తూ అతడి నామస్మరణతో మార్మోగించేస్తారు. అతడు ఒక్క బంతి ఆడితే చాలు అదే మాకు ఫుల్ కిక్​ అంటూ ఫ్యాన్స్​ సంబరపడిపోతుంటారు. అయితే ధోనీ క్రీజులోకి రాగానే అతడికి ఉన్న క్రేజ్‌కు అతడి బ్యాటింగ్ స్టైల్​కు .. ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడిలోకి వెళ్లిపోతుంటారనే చెప్పాలి! అప్పుడప్పుడు సరైన బంతులు వేయడంలోనూ విఫలమవుతుంటారు.

ఇప్పుడు సీఎస్కే ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన చేతన్‌ సకారియాకు కూడా అదే జరిగింది! అతడి బౌలింగ్‌లో ఒత్తిడి స్పష్టంగా కనిపించింది! ఓవర్‌ చివరి రెండు బంతులు వేయాల్సిన సమయంలో ఓ నోబాల్‌, వైడ్‌బాల్‌ వేశాడు. అందుకు కారణం ఎదురుగా క్రీజులో ఉన్నది ధోని కాబట్టి. అతడు క్రీజులోకి రాగానే స్టేడియం మొత్తం ధోనీ.. ధోనీ అని అరుపులతో దద్దరిల్లిపోయింది. అదీ మరి ధోనీ క్రేజ్ అంటే. మాములుగా ఉండదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.