తెలంగాణ

telangana

PKBS vs DC : శతక్కొట్టిన ప్రభ్​ సిమ్రన్.. దిల్లీ కథ ముగిసె..

By

Published : May 13, 2023, 11:00 PM IST

Updated : May 14, 2023, 6:26 AM IST

IPL 2023 PKBS vs DC : ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో భాగంగా పంజాబ్​, దిల్లీ మధ్య మ్యాచ్​ జరిగింది. ఈ పోరులో దిల్లీపై పంజాబ్​ విజయం సాధించింది.

Delhi Capitals vs Punjab Kings
Delhi Capitals vs Punjab Kings

IPL 2023 PKBS vs DC : ఐపీఎల్​ 2023లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై విజయం సాధించింది పంజాబ్​ కింగ్స్​. ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టింది. దిల్లీ క్యాపిటల్స్‌పై 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పటికే ఐదు వరుస ఓటములతో ఈ ఐపీఎల్‌ సీజన్‌ను ఆరంభించిన దిల్లీ.. ప్లేఆఫ్స్‌కు దూరమైన తొలి జట్టుగా నిలిచింది. మధ్యలో కాస్త పుంజుకున్నప్పటికీ, మళ్లీ గాడి తప్పింది. అలా శనివారం పంజాబ్​తో జరిగిన పోరులో తలవంచి, ఎనిమిదో ఓటమిని ఖాతాలో వేసుకోవడంతో ప్లే ఆఫ్స్​ దారులన్నీ మూసుకుపోయాయి. ఇక దిల్లీ లాగే 12వ మ్యాచ్‌ ఆడి, ఆరో విజయం సాధించిన పంజాబ్‌.. తన అవకాశాలను మెరుగుపరుచుకోవడమే కాక, ప్లేఆఫ్స్‌ రేసును రసవత్తరంగా మార్చేసింది. బౌలర్ల ఆధిపత్యం సాగిన మ్యాచ్‌లో మెరుపు శతకం బాదిన ప్రభ్‌సిమ్రన్‌ పంజాబ్‌ హీరోగా నిలిచాడు.

ఇక పంజాబ్​ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులే చేసింది. బ్యాటింగ్​కు దిగినప్పుడుమొదట్లో మంచి ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్​ డేవిడ్​ వార్నర్ 27 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 54 పరుగులతో రాణించాడు. ఫిలిప్​ సాల్ట్​ (21) రాణించాడు. వీరిద్దరి తర్వాత జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. మిచెల్​ మార్ష్​ (3), రిలీ రొస్సో (5), అక్షర్​ పటేల్​ (1), మనీశ్​ పాండే (0) వరుసగా విఫలమయ్యారు. అనంతరం అమన్​ ఖాన్ (16) పరుగులతో కాస్త ఫర్వాలేదనిపించాడు. ప్రవీణ్​ దుబే (15*), కుల్దీప్​ యాదవ్ (5*), ముకేశ్​ కుమార్​ (3*) పరుగులు చేశారు. పంజాబ్​ బౌలర్లలో హర్​ప్రీత్​ బ్రార్​ 4 వికెట్లు పడగొట్టి తన అద్భత ప్రదర్శనతో దిల్లీని గట్టి దెబ్బ తీశాడు. రాహుల్​ చాహర్​, నాథన్​ ఎల్లిస్​ చెరో 2 వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు, టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగలు చేసింది. ప్రభ్​ సిమ్రన్​ 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సులతో 103 పరుగులతోశకక్కొట్టాడు. సామ్ కరన్​ (20) ఫర్వాలేదనిపించాడు. కాగా, మిగతా ప్లేయర్లంతా పేలవ ప్రదర్శన చేశారు. సింగిల్​ డిజిట్​ స్కోరుగే పెవిలియన్ చేరారు. దిల్లీ బౌలర్లలో ఇషాంత్​ (2) వికెట్లు తీసి అదరగొట్టాడు. అక్షర్, ప్రవీన్ దుబే, కుల్దీప్​ యాదవ్, ముకేశ్​ కుమార్​ తలో వికెట్​ తీశారు.

ఇదీ చూడండి:Virat Kohli 71st century : 'ఆ సెంచరీ తర్వాత అతి కష్టం మీద నవ్వాను'

Last Updated : May 14, 2023, 6:26 AM IST

ABOUT THE AUTHOR

...view details