తెలంగాణ

telangana

వార్నర్ అరుదైన రికార్డు.. కోహ్లీ, ధావన్ తర్వాత ఇతడే..

By

Published : Apr 9, 2023, 7:54 AM IST

Updated : Apr 9, 2023, 8:54 AM IST

దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డెవిడ్ వార్నర్​ శుక్రవారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్​లో అత్యధిక పరుగులు సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

david warner
david warner

రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఓటమిని చవి చూసింది. 200 పరుగుల లక్ష్య ఛేదనను దిల్లీ.. 143 మాత్రమే తీసి ఓడిపోయింది. అయితే దిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 65 పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ.. తన స్కోర్​తో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. అయితే ఆయన ఈ మ్యాచ్​లో ఓడినప్పటికీ ఓ అరుదైన ఘనతను వార్నర్​ తన ఖాతాలో వేసుకున్నాడు. అలా ఐపీఎల్ ఎలైట్ క్లబ్‌లో స్థానాన్ని సంపాదించుకున్నాడు.

శనివారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​తో.. లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన మొదటి విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్​ వార్నర్.. 55 బంతుల్లో 65 రన్స్​ స్కోర్​ చేశాడు. అలా ఐపీఎల్‌లో 6 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఇక వార్నర్ కంటే ముందు ఈ లిస్ట్​లో టీమ్​ఇండియాకు చెందిన విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్​లు ఉన్నారు.

ఆర్సీబీ టీమ్​ ప్లేయర్​ విరాట్​ కోహ్లీ 225 మ్యాచ్‌ల్లో 36.55 సగటుతో 6,727 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న పంజాబ్​ కెప్టెన్ శిఖర్ ధావన్ 208 మ్యాచుల్లో 35.58 సగటుతో 6,370 పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత తర్వాత డేవిడ్ వార్నర్ 165 మ్యాచ్‌ల్లో 42.23 సగటుతో 6,039 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 57 అర్ధశతకాలు ఉన్నాయి. వార్నర్​ తర్వాత ఈ జాబితాలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఇతను 229 మ్యాచ్‌ల్లో 30.22 సగటుతో 5,893 పరుగులు స్కోర్​ చేశాడు. రోహిత్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేశ్​ రైనా.. 205 మ్యాచ్‌ల్లో 32.51 సగటుతో 5,528 పరుగులు చేశాడు.

డెవిడ్​ స్కోర్​తోనే..
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ వరుస పరాజయాలు చవిచూస్తోంది. రాజస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ దిల్లీ క్యాపిటల్స్‌ 57 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమిని మూట్టగట్టుకుంది. శనివారం జరిగిన మ్యాచ్​లో కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌ ఒంటరి పోరాటం చేశాడు. జట్టుకు 65 పరుగులను అందించాడు. మధ్యలో లలిత్‌ యాదవ్‌ 38 పరుగుల స్కోర్​ వరకు నిలకడగా ఆడినప్పటికి అతను పెవిలియన్​ బాట పట్టాక అయిన తర్వాత దిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.

లఖ్​నవూతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఛేజింగ్‌ చేయడంలో విఫలమైంది. లఖ్​నవూ ఇచ్చిన 194 పరుగుల టార్గెట్‌ను స్కోర్​ చేయలేక 143 పరుగుల వద్దే ఆగిపోయింది. మరోవైపు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులే స్కోర్​ చేయగలిగింది. అయితే గుజరాత్‌ మాత్రం 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని విజయాన్ని సాధించింది. ఇక మూడో మ్యాచ్​లోనూ పరజయాన్ని మూటగట్టుకుంది. అయితే డేవిడ్​ వార్నర్​ ఇచ్చిన స్కోర్​ వల్ల కొంతమేర దిల్లీ ఘోర ఓటమిని చవి చూసే ప్రమాదం తప్పింది.

Last Updated : Apr 9, 2023, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details