ETV Bharat / sports

IPL 2023: వార్నర్​ శ్రమ వృథా.. రాజస్థాన్​ చేతిలో దిల్లీ ఘోర ఓటమి

author img

By

Published : Apr 8, 2023, 7:22 PM IST

Updated : Apr 8, 2023, 7:32 PM IST

ఐపీఎల్​ 16వ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. రాజస్థాన్​ చేతిలో 57 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ipl 2023 rajasthan royals delhi capitals match winner
ipl 2023 rajasthan royals delhi capitals match winner

ఐపీఎల్​ 16వ సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్​ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో 57 పరుగుల తేడాతో గెలిపొందింది. దిల్లీ కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ రాణించినా లాభం లేకుండా పోయింది. రాజస్థాన్​ బౌలర్లలో ట్రెంట్​ బౌల్ట్, చహల్​ తలో మూడు వికెట్లు పడగొట్టారు. రవిచంద్రన్​ అశ్విన్​ రెండు, సందీప్ శర్మ ఒక వికెట్​​ తీశాడు.

రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్‌ తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఖలీల్ అహ్మద్‌ స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన పృథ్వీ షా (0) ఔటయ్యాడు. తర్వాతి బంతికే మనీశ్‌ పాండే (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. రిలీ రోసోవ్ (14).. అశ్విన్‌ వేసిన చక్కటి బంతికి జైస్వాల్‌కు చిక్కాడు. తర్వాత నిలకడగా ఆడుతున్న లలిత్‌ యాదవ్‌ (38) ఔటయ్యాడు. అతడిని ట్రెంట్‌ బౌల్ట్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్ (2) చహల్‌ బంతికి స్టంపౌటయ్యాడు. అశ్విన్‌ వేసిన బంతికి పొవెల్‌ (2) హెట్‌మయర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అభిషేక్​ పొరెల్​ కూడా పెవిలియన్​ చేరాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​(65) ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.​ నార్జ్ డకౌటయ్యాడు. కుల్​దీప్​ యాదవ్(3*), ముఖేశ్​ కుమార్​ ​(1*)​ నాటౌట్​గా నిలిచారు.

టాస్​ ఓడి రాజస్థాన్​ రాయల్స్​ బ్యాటింగ్​కు దిగింది. ఓపెనర్లుగా జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌ శుభారంభం చేశారు. యువ బ్యాటర్ యశస్వి విజృంభించాడు. ఖలీల్ అహ్మద్‌ వేసిన తొలి ఓవర్‌లో ఐదు ఫోర్లు బాదాడు. తొలి మూడు బంతులకు హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన యశస్వి చివరి రెండు బంతులను కూడా బౌండరీలుగా మలిచాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముఖేశ్‌కుమార్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో మూడో బంతికి యశస్వి జైస్వాల్ (60) ముఖేశ్‌కే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్​ సంజూ శాంసన్​ నిరాశపరిచాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ చక్కని బంతికి సంజూ(0) నార్జ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అనంతరం బరిలోకి దిగిన రియాన్‌ పరాగ్ (7)ను పొవెల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జోస్​ బట్లర్​(79) దుమ్మురేపాడు. ముఖ్​శ్​ బౌలింగ్​లోనే పెవిలియన్​ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్(8*)​, హెట్​మెయిర్(39*) నాటౌట్​గా నిలిచారు. ఫలితానికి రాజస్థాన్​ 199 పరుగులు సాధించింది.

వార్నర్​ అరుదైన రికార్డు..
ఈ మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ అరుదైన ఘనత సాధించాడు. లీగ్​ చరిత్రలో ఆరువేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. ఆ జాబితాలో వార్నర్​ కన్నా ముందు విరాట్​ కోహ్లీ(6727), శిఖర్​ ధావన్​(6370) ఉన్నారు.

6 బంతుల్లో 5 ఫోర్లు.. యశస్వి నయా రికార్డు!
ఈ మ్యాచ్​లో దిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే రాజస్థాన్​ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4,4,4,0, 4, 4) ఐదు బౌండరీలు బాదాడు. వరుసగా మూడు బౌండరీలు కొట్టిన యశస్వి జైస్వాల్.. నాలుగో బంతిని డాట్ చేసి మరో రెండు బౌండరీలు బాదాడు. దాంతో జట్టుకు తొలి ఓవర్‌లోనే 20 పరుగులు ఇచ్చాయి. ఈ సీజన్‌లో ఫస్ట్ ఓవర్‌లో వచ్చిన అత్యధిక పరుగులు ఇవే కావడం గమనార్హం.

Last Updated :Apr 8, 2023, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.