తెలంగాణ

telangana

విండీస్​తో సిరీస్​ క్లీన్​స్వీప్​.. టీ20ల్లో అగ్రస్థానానికి టీమ్​ఇండియా

By

Published : Feb 20, 2022, 10:50 PM IST

Updated : Feb 21, 2022, 12:03 AM IST

IND vs WI: వన్డే సిరీస్​లో 3-0తో విజయభేరీ మోగించిన టీమ్​ఇండియా.. టీ20 సిరీస్​లోనూ అదే ఫలితం ఫునరావృతం చేసింది. దీంతో కెప్టెన్​గా రోహిత్ శర్మకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఈ సిరీస్​ విజయంతో అంతర్జాతీయ టీ20ల్లో టీమ్​ఇండియా అగ్రస్థానానికి చేరుకుంది.

sky venkatesh iyer
టీమ్​ఇండియా

Team india Rohit sharma: మూడో టీ20లోనూ టీమ్​ఇండియా గెలిచింది. కోల్​కతాలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో వెస్టిండీస్​పై విజయం సాధించిన రోహిత్ సేన.. టీ20 సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది.

టీ20ల్లో టాప్​..

సిరీస్​ విజయంతో టీ20 ర్యాంకింగ్స్​లో 269 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్​ను వెనక్కునెట్టింది టీమ్​ఇండియా. దాదాపు ఆరేళ్ల తర్వాత పొట్టి ఫార్మాట్​లో తొలి స్థానానికి చేరుకుంది. అంతకుముందు 2016 ఫిబ్రవరిలో చివరిసారిగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో అగ్రస్థానంలో ఉంది భారత్​.

సూర్య, అయ్యర్​ మెరుపులు..

మూడో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్(65) అద్భుతమైన బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్(35) ధనాధన్ ఇన్నింగ్స్​తో అలరించాడు. ఇషాన్ కిషన్ 34 పరుగులు చేశాడు. విండీస్​ బౌలర్లలో హోల్డర్, షెపార్డ్, ఛేజ్, వాల్ష్, డ్రేక్స్ తలో వికెట్​ తీశారు.

సూర్యకుమార్ యాదవ్

అనంతరం ఛేదనను ప్రారంభించిన కరీబియన్​ జట్టు.. ధాటిగానే బ్యాటింగ్ చేసింది. కానీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల నిర్ణీత ఓవర్లలో 167/9 పరుగులే చేయగలిగింది.

విండీస్ బ్యాటర్లలో పూరన్(61).. మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో పొవెల్ 25, మేయర్స్ 6, హోప్ 8, పొలార్డ్ 5, హోల్డర్ 2, ఛేజ్ 12, షెపార్డ్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, వెంకటేశ్ అయ్యర్ తలో రెండు వికెట్లు తీశారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 21, 2022, 12:03 AM IST

ABOUT THE AUTHOR

...view details