తెలంగాణ

telangana

IND vs SA Test: రాహుల్ మరో ఘనత.. పుజారా చెత్త రికార్డు

By

Published : Dec 27, 2021, 10:44 AM IST

KL Rahul Record: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. ఈ క్రమంలోనే ఓ రికార్డును నెలకొల్పాడు. ఇక ఈ మ్యాచ్​లో డకౌట్​గా వెనుదిగిరిన పుజారా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.

rahul record, pujara duck record, రాహుల్ రికార్డు, పుజార్ డకౌట్ రికార్డు
rahul

KL Rahul Record: దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ (122 నాటౌట్‌; 248 బంతుల్లో) ఆదివారం శతకం సాధించి ఆకట్టుకున్నాడు. దీంతో తొలి రోజు భారత్‌ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే రాహుల్‌ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా గడ్డపై శతకం సాధించిన భారత రెండో ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు. అది కూడా 14 ఏళ్ల తర్వాత సాధించడం గమనార్హం. ఇంతకుముందు మాజీ బ్యాటర్ వసీమ్‌ జాఫర్‌ 2007 పర్యటనలో దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టీమ్‌ఇండియా తరఫున శతకం (116) బాదిన ఓపెనర్‌గా నిలిచాడు. మళ్లీ ఇన్నాళ్లకు రాహుల్‌ ఆ ఘనత సాధించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా రాహుల్‌ మరో రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌ దేశాల్లో సెంచరీలు బాదిన బ్యాటర్​గా నిలిచాడు. అలాగే పాకిస్థాన్‌ మాజీ బ్యాటర్ సయీద్‌ అన్వర్‌, వెస్టిండీస్‌ బ్యాటర్ క్రిస్‌గేల్‌ తర్వాత ఆసీస్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ దేశాల్లో సెంచరీలు బాదిన మూడో ఓపెనింగ్‌ బ్యాటర్​గానూ ఘనత సాధించాడు.

పుజారా చెత్త రికార్డు

Pujara Duck out: ఈ మ్యాచ్​లో మూడో స్థానంలో బ్యాటింగ్​కు దిగిన నయా వాల్ పుజారా డకౌట్​గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్​కు దిగి ఎక్కువ సార్లు (9) డకౌట్​గా వెనుదిరిగిన బ్యాటర్​గా చెత్త రికార్డు నెలకొల్పాడు. దిలీప్ వెంగ్​సర్కార్ (8), ద్రవిడ్ (7), మొహిందర్ అమరనాథ్ (6), అజిత్ వాడేకర్ (5) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

'నన్ను ఎందుకు తప్పించారో తెలియదు'.. భజ్జీ షాకింగ్ కామెంట్స్

ABOUT THE AUTHOR

...view details