తెలంగాణ

telangana

IndvsEng: 'కోహ్లీ పరుగులు చేయాలంటే ఇలా ఆడాలి'

By

Published : Aug 30, 2021, 5:50 PM IST

టీమ్​ఇండియా సారథి కోహ్లీ కొంత కాలంగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతున్న సిరీస్​లోనూ రాణించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ ఎందుకు విఫలమవుతున్నాడు? ఎలా ఆడితే బాగుంటుంది.. అనే విషయాలపై స్పందించాడు దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​.

kohli
కోహ్లీ

విరాట్ కోహ్లీ.. సెంచరీ బాదితే చూడాలని కళ్లు కాయలు కాసేలా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ కొంత కాలంగా విరాట్​ వారి అంచనాల్ని తలకిందులు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​లోనైనా పరుగుల వరద పారిస్తాడనుకుంటే మళ్లీ నిరాశపరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్​లో ఒక్క హాఫ్​ సెంచరీ మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో విరాట్​ ప్రదర్శనపై స్పందించిన దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్.. పేలవమైన షాట్ల ఎంపిక వల్ల కోహ్లీ నిలకడగా పరుగులు చేయలేక కష్టపడుతున్నాడని అన్నాడు.

"కోహ్లీ శరీరం నుంచి బ్యాట్​ దూరంగా ఉంటోంది. అందువల్లే ఈ సమస్య. దూరంగా వెళ్లే బంతిని అందుకోవడానికి విరాట్ ప్రయత్నిస్తున్నాడు. క్రీజు బయట నిలబడటం సమస్య కాదు. శరీరానికి దగ్గరగా ఆడితే బంతి.. బ్యాటు అంచుకు తగలకుండా దగ్గరి నుంచి వెళ్లిపోతుంది. అలాంటప్పుడు బాల్ మిస్ అయినా ప్రమాదం ఉండదు. నాకు తెలిసి అతడు షాట్ల ఎంపికపై దృష్టి పెట్టాలి. సింపుల్​గా ఆడాలి. ఇప్పటికీ విరాట్​ 8 వేల పరుగులు చేశాడు. అందులో 6వేల 500 రన్స్ క్రీజు బయట నిలబడి చేసినవే. కాబ్టటి తన ఆటతీరులో పెద్దగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం షాట్ల ఎంపిక సరి చేసుకుంటే చాలు."

-గావస్కర్​,టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్​.

పుజారా కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని అన్నాడు గావస్కర్​. " పుజారా అనవసర బంతుల్ని ఆడుతున్నాడు. వాటిని వదిలేయడం వల్ల సమస్యేమి ఉండదు. అతడు కూడా షాట్ల ఎంపికపై దృష్టి పెట్టాలి" అని గావస్కర్​ వెల్లడించాడు.

ప్రస్తుతం టీమ్​ఇండియా-ఇంగ్లాండ్​ మధ్య ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచుల్లో చెరో మ్యాచ్ గెలిచాయి. నాలుగో టెస్టు ఓవల్​ వేదికగా సెప్టెంబరు 2న ప్రారంభంకానుంది.

ఇదీ చూడండి: IndvsEng: 'మూడో టెస్టులో అందుకే ఓడిపోయాం'

ABOUT THE AUTHOR

...view details