తెలంగాణ

telangana

ఐపీఎల్ టాప్​-5 ప్లేయర్స్​ వీరే: గంగూలీ

By

Published : Feb 25, 2023, 7:43 PM IST

భవిష్యత్‌లో ఐపీఎల్‌లో పెద్ద క్రికెటర్స్​గా అవతరించే ఐదుగురు యువ ఆటగాళ్ల పేర్లను తెలిపాడు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ. ఆ వివరాలు..

Etv Bharat
Etv Bharat

ఐపీఎల్​.. ఈ మెగాలీగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందరో ఆటగాళ్లు ఈ లీగ్​తోనే ఓవర్​నైట్ స్టార్స్​గా ఎదిగారు. తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. జాతీయ జట్టులో స్థానం కూడా దక్కించుకున్నారు. అయితే మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ తాజా సీజన్​ ప్రారంభంకానుంది. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ షోలో పాల్గొన్న టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ కీలక కామెంట్స్​ చేశాడు.

ఐపీఎల్​ భవిష్యత్‌లో పెద్ద ఆటగాళ్లుగా మారే ఐదుగురు యువ ఆటగాళ్లను సెలెక్ట్​ చేశాడు. వారు తమ ఆటతో ఉన్నత స్థాయికి చేరుకుంటారని కితాబిచ్చాడు. లేటు వయసులో టీమ్​లోకి ఎంట్రీ ఇచ్చి తన సంచలన ఇన్నింగ్స్​ ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకుంటున్న సూర్యకుమార్‌ యాదవ్‌ను... యంగ్ ప్లేయర్స్​తో కాకుండా స్పెషల్ కేటగిరీలో ఎంచుకున్నాడు.

యంగ్ ప్లేయర్స్​లో.. మొదట పృథ్వీ షాను సెలెక్ట్​ చేసుకోగా.. రెండు, మూడు స్థానాల్లో రిషభ్ పంత్, ‌రుతురాజ్‌ గైక్వాడ్‌లను ఎంచుకున్నాడు. నాలుగు, ఐదు స్థానాల్లో ఉమ్రాన్‌ మాలిక్, శుభ్‌మన్‌ గిల్‌లను తీసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌, ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌లను గంగూలీ పరిగణనలోకి తీసుకోలేదు.

"ఆటతీరు పరంగా సూర్యకుమార్ యాదవ్ బెస్ట్​ ప్లేయర్​. కానీ, అతడిని యంగ్​ ప్లేయర్స్​ జాబితాలోకి తీసుకోలేం. యువ ఆటగాళ్లలో టీ20ల్లో పృథ్వీ షా, పంత్​కు చాలా టాలెంట్​ ఉందని భావిస్తున్నాను. వారిద్దరి వయసు పాతికేళ్లలోపే ఉంటుంది. రుతురాజ్ గైక్వాడ్ ఎలా ఆడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేను అతడి ఆటను చూస్తూనే ఉంటాను. అతడు నా దృష్టిలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక యువ పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌, గిల్​ కూడా మంచి ప్లేయర్స్​. ఉమ్రాన్​ ఫిట్‌గా ఉంటే తన పేస్‌తో వీక్షకులకు మ్యాచ్‌పై ఆసక్తి ఏర్పడేలా చేస్తాడు" అని గంగూలీ తన అభిప్రాయాన్ని చెప్పాడు.

అయితే గిల్​ గురించి మొదట గంగూలీ చెప్పలేదు. ఈ షోలో పాల్గొన్న మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌.. శుభ్‌మన్ గిల్‌ గురించి అడగ్గా.."అతడు నా ఐదో ప్లేయర్​. పృథ్వీ షా, రిషబ్ పంత్, సూర్యకుమార్‌ ఈ లిస్ట్​లో టాప్​ ప్లేస్​లో ఉండగా... రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, శుభ్‌మన్ గిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు" అని దాదా వెల్లడించాడు. కాగా, మార్చి 31 నుంచి ఐపీఎల్ తాజా సీజన్‌ మొదలు కానుంది. ఇకపోతే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్‌ ఈ ఏడాది ఐపీఎల్​కు దూరమయ్యాడు.

ఇదీ చూడండి:ఐపీఎల్ ముందు గుజరాత్ టైటాన్స్​కు బిగ్​ షాక్​!

ABOUT THE AUTHOR

...view details