తెలంగాణ

telangana

IND Vs ENG: వోక్స్​ హాఫ్ సెంచరీ.. ఇంగ్లాండ్​ ఆలౌట్

By

Published : Sep 3, 2021, 9:50 PM IST

నాలుగో టెస్టు తొలిఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ ఆలౌటైంది. దీంతో 99 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. ఆతిథ్య జట్టులో పోప్, వోక్స్.. అర్ధశతకాలతో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.

IND Vs ENG 4th Test
IND Vs ENG 4th Test

టీమ్​ఇండియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ ఆలౌట్ అయింది. 53 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లిష్​ జట్టు.. 290 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. తద్వాతా 99 రన్స్​​ ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో క్రిస్​ వోక్స్(50)​ అద్భుతమైన హాఫ్​సెంచరీతో ఆకట్టుకున్నాడు.

53/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆతిథ్య జట్టు.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ (31), క్రేగ్‌ ఓవర్టన్‌ (1) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఉమేశ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో రోహిత్‌, కోహ్లీలకు చిక్కారు. దాంతో ఇంగ్లాండ్‌ 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. తర్వాత నెమ్మదిగా ఆడిన ఓలీ పోప్‌, జానీ బెయిర్‌స్టో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే తొలి సెషన్‌ పూర్తయ్యేసరికి 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

రెండో సెషన్‌లో 28 ఓవర్ల ఆట జరగ్గా 88 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టో(37) వికెట్ల ముందు దొరికిపోగా జడేజా బౌలింగ్‌లో మొయిన్‌ అలీ(35)ని రోహిత్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఒకనొక దశలో ఓలీ పోప్​ సెంచరీ దిశగా అడుగులు వేయగా.. శార్దూల్​ ఠాకూర్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు. చివరిగా బ్యాటింగ్​కు వచ్చిన క్రిస్​ వోక్స్​ హాఫ్​సెంచరీతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.

ఇదీ చూడండి..IND Vs ENG: రెండో సెషన్​ పూర్తి.. ఇంగ్లాండ్​ 227/7

ABOUT THE AUTHOR

...view details