తెలంగాణ

telangana

సచిన్-గంగూలీతో ఆడిన ప్లేయర్​.. ఇప్పుడు ప్రముఖ యాక్టర్​గా!.. ఎవరో తెలుసా?

By

Published : Jul 9, 2023, 7:36 AM IST

Cricketers in movies : దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్​, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్​ లాంటి ఆటగాళ్లతో కలిసి ఆడిన ఓ భారత ఆటగాడు.. ప్రస్తుతం సినీ రంగంలో పూర్తిస్థాయిలో సెటిల్​ అయి రాణిస్తున్నాడన్న సంగతి తెలుసా? ఇంతకీ అతడెవరంటే?

Cricketers in movies
సచిన్-గంగూలీతో ఆడిన ప్లేయర్​.. ఇప్పుడు ప్రముఖ యాక్టర్​గా.. ఎవరో తెలుసా?

Cricketers in movies : క్రికెట్-సినిమా ఈ రెండింటికీ మధ్య ఓ ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఈ రెండు రంగాలకు సంబంధించిన సెలబ్రిటీలు ఒకే స్టేజ్ లేదా ఒకే తెరను పంచుకుంటే.. అభిమానులకు వచ్చే ఆ కిక్కే వేరు. భారత తొలి తరం సారథి మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ నుంచి ఇప్పటి కోహ్లీ వరకు ఎంతో మంది క్రికెటర్లు.. బాలీవుడ్‌ భామాలతో రొమాన్స్​ చేశారు. అలాగే కొంతమంది పెళ్లి చేసుకుని కలిసి జీవిస్తున్నారు. అజహరుద్దీన్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా, కోహ్లీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఈ లిస్ట్​లో ఉంటారు. అలానే కొందరు ప్లేయర్స్​.. నటనలోనూ రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీశాంత్‌, హర్భజన్‌ వంటి వారు సిల్వర్​ స్క్రీన్​పై మెరిశారు. అయితే దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్​, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్​ లాంటి ఆటగాళ్లతో కలిసి ఆడిన ఓ భారత ఆటగాడు ప్రస్తుతం సినీ రంగంలో పూర్తిస్థాయిలో సెటిల్​ అయి రాణిస్తున్నాడన్న సంగతి తెలుసా?

అవును వన్డే క్రికెట్‌లో వేసిన మొదటి బంతికే వికెట్‌ తీసిన తొలి భారత ప్లేయర్​గా రికార్డుకెక్కిన భారత ఓపెనర్‌ సదగోపన్‌ రమేశ్‌. 1999లో చెన్నై చెపాక్‌ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్​తో.. అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు ఈ లెఫ్ట్‌ హ్యాండ్ బ్యాటర్​. టీమ్‌ఇండియా తరఫున 19 టెస్టులు, 24 వన్డేలు ఆడాడు. అందులో 2 శతకాలు, 14 అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు.

sadagoppan ramesh movies : అలా ఓపెనర్‌గా సేవలందించిన రమేశ్‌.. ఎక్కువ కాలం నేషనల్ టీమ్​లో కొనసాగలేకపోయాడు. ఆ తర్వాత ఆటకు దూరమయ్యాడు. అయితే సాధారణంగా భారత క్రికెటర్లు రిటైర్మెంట్‌, ఆట నుంచి తప్పుకున్నాక.. ఎక్కువగా క్రికెట్ కామెంటరీ లేదా శిక్షణ రంగంలో కెరీర్ రాణిస్తుంటారు. కానీ సదగోపన్‌ రమేశ్‌ మాత్రం.. అలా చేయలేదు. సినిమాను ఎంచుకున్నాడు. అలా ప్రస్తుతం అతడు సినీ రంగంలోనే కొనసాగుతున్నాడు.

2008లో తమ సొంత భాష అయిన తమిళ చిత్ర సీమలోకి అరంగేట్రం చేశాడు. స్టార్‌ యాక్టర్స్​ జయం రవి, జెనీలియా డిసౌజా, ప్రకాశ్‌రాజ్​తో కలిసి రొమాంటిక్‌ కామెడీ 'సంతోష్‌ సుబ్రమణ్యం'తో సిల్వర్​ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2011లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పొట్టా పొట్టి'లో నటించాడు. అలా పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణను దక్కించుకున్నాడు. 2019లో ' karaoke స్వరాస్‌' పేరుతో ఓ స్టూడియోను నిర్మించాడు. ఓ రియాల్టీ షోలోనూ జడ్జీగా కొనసాగుతున్నాడు. ఆతడు సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్‌కు వీరాభిమాని. అతడికి 2002లో పెళ్లి అయింది. ఓ అమ్మాయి ఉంది.

ఇదీ చూడండి :

పెంపుడు కుక్కలతో మహీ బర్త్​డే సెలబ్రేషన్స్​.. అందరినీ ఫిదా చేశాడుగా!

విండీస్‌తో పోరు.. ఎయిర్​పోర్టులో టీమ్​ఇండియా ప్లేయర్ల సందడి.. ఫొటోస్​ అదిరాయి!

ABOUT THE AUTHOR

...view details