తెలంగాణ

telangana

Cricket Afghanistan: 'అఫ్గాన్‌ క్రికెట్‌కు అంతరాయం కలిగించబోం'

By

Published : Sep 1, 2021, 7:11 AM IST

అఫ్గానిస్థాన్ క్రికెట్ (Cricket Afghanistan) మ్యాచులకు ఎలాంటి అంతరాయం కలిగించబోమని స్పష్టం చేశారు తాలిబన్లు(Afghanistan Taliban). ముందు ఖరారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం ఆడేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.

cricket afghanistan
అఫ్గానిస్థాన్‌

ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో(Afghanistan news) నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల కారణంగా ఆ దేశ క్రికెట్‌ (Cricket Afghanistan) భవిష్యత్తుపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, ఇంతకుముందే షెడ్యూల్‌ ఖరారు చేసిన మ్యాచులు ఆడేందుకు అంతరాయం కలిగించబోమని తాలిబన్లు(Afghanistan Taliban) స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబరులో అఫ్గానిస్థాన్‌ జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ ఆడుతుందని తాలిబన్‌ సాంస్కృతిక కమిషన్‌ డిప్యూటీ హెడ్‌ అహ్మదుల్లా వసీఖ్‌ పేర్కొన్నారు. 'భవిష్యత్తులో అన్ని దేశాలతో మేం సత్సంబంధాలు ఏర్పరచుకోవాలనుకుంటున్నాం. అప్పుడే, అఫ్గాన్‌ ఆటగాళ్లు విదేశాలకు, విదేశీ ఆటగాళ్లు అఫ్గాన్‌కు రాగలుగుతారు' అని ఆయన అన్నారు.

మరోవైపు నవంబరులో ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో జరుగనున్న చరిత్రాత్మక టెస్టు మ్యాచ్‌ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 'క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ), అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(ఏసీబీ) మధ్య సత్సంబంధాలున్నాయి. ఇరు జట్లు కలిసి కచ్చితంగా టెస్టు మ్యాచ్‌ ఆడతాయి. దాని తర్వాత దుబాయిలో జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో కూడా అఫ్గాన్‌ జట్టు పాల్గొంటుంది' అని వెల్లడించారు.

ఇదీ చూడండి:Indvseng: 'పంత్​ మ్యాచ్ విన్నర్.. కాస్త ఓపిక పట్టండి'

ABOUT THE AUTHOR

...view details