తెలంగాణ

telangana

బంగ్లాదేశ్ జట్టు​కు భారత్ ​కోచ్​ సలహా ఇదే..!

By

Published : Nov 25, 2019, 6:59 AM IST

టీమిండియాతో రెండో టెస్టుల సిరీస్​లో క్లీన్​స్వీప్​ అయిన​ బంగ్లా జట్టుకు భారత ప్రధాన కోచ్​ రవిశాస్త్రి ఓ సలహా ఇచ్చాడు. కోహ్లీసేన రాణించేందుకు పటిష్ఠమైన బౌలింగ్​ లైనప్​ కారణంగా చెప్పిన ఆయన... బౌలింగ్​పై బంగ్లాదేశ్​ ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించాడు.

బంగ్లాదేశ్ జట్టు​కు భారత్ ​కోచ్​ సలహా ఇదే..!

బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్‌ గెలిచిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు ప్రధాన కోచ్​ రవిశాస్త్రి. ముఖ్యంగా భారత పేసర్ల ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే సమష్టిగా రాణించడం వల్లే టీమిండియా విజయవంతమైందని చెప్పుకొచ్చాడు. వికెట్లను పడగొట్టాలనే కసి కారణంగానే భారత్‌ అద్భుతమైన విజయాలు సాధిస్తుందన్నాడు.

ఇషాంత్​, షమి, ఉమేశ్​

" ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా పేసర్లు చెలరేగిపోతున్నారు. ఇందువల్లే మంచి ఫలితాలు వస్తున్నాయి. భారత బౌలింగ్​ దళం ప్రపంచ అత్యుత్తమ స్థాయికి ఎదగడం ఆనందకరం. ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే గర్వంగా ఉంది. జట్టు ఇంత బలంగా తయారవడానికి చాలా సమయం పట్టింది.15 నెలల నుంచి విదేశీ గడ్డపై సిరీస్​లు ఆడాం. అక్కడ చేసిన తప్పుఒప్పులతో ఆటగాళ్లు పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడు అదే సత్ఫలితాలను ఇస్తోంది. పిచ్‌ పరిస్థితిని తొందరగా అర్థం చేసుకుంటున్నారు. పింక్‌ బాల్‌ టెస్టులో పిచ్‌ను కచ్చితంగా అంచనా వేశారు".

-- రవిశాస్త్రి, భారత కోచ్​

కోహ్లీ సేన గురించి మాట్లాడిన రవిశాస్త్రి... బంగ్లా జట్టుకు ఓ సలహా ఇచ్చాడు. విదేశాల్లో విజయాలు సాధించాలంటే బౌలింగ్‌ విభాగాన్ని మరింత పటిష్ఠంగా మార్చుకోవాలని సూచించాడు. పదునైన పేస్​ బౌలింగ్​ లేకపోవడం వల్లే... స్వదేశంలో తిరుగులేని జట్టుగా ఉన్న బంగ్లాదేశ్​ విదేశీ పిచ్‌లపై విఫలమవుతుందని అన్నాడు.

ABOUT THE AUTHOR

...view details