తెలంగాణ

telangana

ఫించ్ సెంచరీ వృథా.. సిక్సర్స్​దే గెలుపు

By

Published : Jan 25, 2020, 2:21 PM IST

Updated : Feb 18, 2020, 8:55 AM IST

ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ బిగ్​బాష్​ లీగ్​లో సెంచరీతో రాణించాడు. సిడ్నీ సిక్సర్స్​తో జరిగిన మ్యాచ్​లో శతకంతో చెలరేగాడు. కానీ మ్యాచ్​ను గెలిపించలేకపోయాడు.

aaron
aaron

ఆస్ట్రేలియా క్రికెటర్ ఫించ్ బిగ్​బాష్​ లీగ్​లో మరోసారి సత్తాచాటాడు. మెల్​బోర్న్​ రెనిగేడ్స్​కు సారథ్యం వహిస్తోన్న ఈ ఆటగాడు సెంచరీతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. సిడ్నీ సిక్సర్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో 68 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. బీబీఎల్​లో ఫించ్​కు ఇది రెండో సెంచరీ.

కానీ జట్టును గెలిపించలేకపోయాడు

ఫించ్ సెంచరీతో మెరవగా రెనిగేడ్స్​ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్​ లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ఇందులో ఓపెనర్ జోష్ ఫిలిఫ్​ 61 పరుగులతో రాణించగా.. ఆసీస్ సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అర్ధసెంచరీ (66)తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. గత ఆరు సీజన్లలో స్మిత్​కు ఇది తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఫలితంగా సిడ్నీ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇవీ చూడండి.. వివాదాలే మా ఇద్దరి మధ్య పోలిక: కంగనా రనౌత్

Last Updated : Feb 18, 2020, 8:55 AM IST

ABOUT THE AUTHOR

...view details