తెలంగాణ

telangana

Eng vs Aus fourth test : రసవత్తరంగా రెండో టెస్ట్​.. స్మిత్​, కమిన్స్​ జోరు.. ఆధిక్యంలో ఆసీస్

By

Published : Jul 29, 2023, 7:46 AM IST

eng vs aus fourth test 2023 : ప్రతిష్టాత్మక యాషెస్‌ ఆఖరి టెస్టు అంచనాలకు తగ్గట్టు హోరోహోరీగా సాగుతోంది. రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి ఆసీస్‌ 295 పరుగులతో ఆలౌట్ అయి.. 12 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది.

Eng vs Aus fourth test
Eng vs Aus fourth test : రసవత్తరంగా రెండో టెస్ట్​.. స్మిత్​, కమిన్స్​ జోరు.. ఆసీస్​ ఆధిక్యం ఎంతంటే?

england vs australia fourth test : ప్రతిష్టాత్మక యాషెస్‌ ఆఖరి టెస్టు అంచనాలకు తగ్గట్లే రసవత్తరంగా కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 283 పరుగులకు ఆలౌట్​ అవ్వగా.. ఆస్ట్రేలియా జట్టు 295 పరుగులు చేసి 12 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండో రోజు ఇంగ్లాండ్​ బౌలర్లు జోరు చూపించారు. దీంతో ఆ టీమే ఆధిక్యంలో నిలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ స్టీవ్‌ స్మిత్‌ (123 బంతుల్లో 71; 6×4), ప్యాట్‌ కమిన్స్‌ (86 బంతుల్లో 36*; 4×4), టాడ్‌ మర్ఫీ (39 బంతుల్లో 36; 2×4, 3×6) మంచిగా రాణించడం వల్ల ఆస్ట్రేలియా పుంజుకుని స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది.

రెండో రోజు ఆట సాగిందిలా.. ఓవర్‌నైట్‌ స్కోరు 61/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తూ ఆస్ట్రేలియా చాలా జాగ్రత్తగా ఆడింది. ఖవాజా(ఓవర్‌నైట్‌ స్కోరు 24), లబుషేన్‌(ఓవర్‌నైట్‌ స్కోరు 2) పరుగుల కోసం ప్రయత్నించలేదు. కేవలం క్రీజులో పాతుకుపోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆట ప్రారంభమైన గంటన్నార వరకు ఒక్క వికెట్‌ కూడా పడలేదు. ఆ తర్వాత 82 బంతుల్లో 9 పరుగులే చేసిన లబుషేన్‌.. మార్క్‌ వుడ్‌ (2/62) బౌలింగ్​లో ఔట్​​ అయ్యాడు. అతడు వేసిన ఔట్‌ స్వింగర్‌కు స్లిప్‌లో ఉన్న రూట్‌ అద్భుతంగా డైవ్‌ చేస్తూ ఎడమ చేత్తో అదిరిపోయే క్యాచ్ పట్టాడు.

ఆ తర్వాత ఖవాజా(47), ట్రావిస్‌ హెడ్‌(4).. అండర్సన్‌(1/67) బౌలింగ్​లో వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరారు. దీంతో ఆసీస్‌ 127/4తో కష్టాల్లోకి వెళ్లిపోయింది. అప్పుడు స్టీవ్‌ స్మిత్‌ విజృంభించి ఆడాడు. అతడికి కాసేపు మిచెల్‌ మార్ష్‌ (16) అండగా నిలిచాడు. అయితే మిచెల్​ను అండర్సన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇక ఆ తర్వాత కేరీ (10), స్టార్క్‌ (7) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 185/7తో పతనం దిశగా ముందుకు సాగింది. దీంతో ఇంగ్లాండ్‌ మంచి ఆధిక్యం సాధిస్తుందని అంతా అనుకున్నారు.

steve smith ashes 2023 : కానీ స్మిత్‌.. తన అద్భుత పోరాటంతో ఇంగ్లిష్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. మరో ఎండ్‌లో కెప్టెన్‌ కమిన్స్‌ కూడా మంచిగా ఆడాడు. ఈ క్రమంలోనే స్మిత్‌ సెంచరీ చేస్తాడని అనిపించింది. కానీ అతడికి వోక్స్‌ (3/61) చెక్‌ పెట్టాడు. అయినప్పటికీ కమిన్స్‌కు తోడుగా నిలిచిన స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ, ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఎదురు దాడికి దిగి పరుగులను అందుకున్నాడు. మూడు సిక్సర్లు బాదేశాడు.

ఇదే క్రమంలో కమిన్స్‌.. స్మిత్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 54 పరుగులు, మర్ఫీతో కలిసి తొమ్మిదో వికెట్‌కు 49 పరుగులు జోడించి తన టీమ్​ ఆధిపత్యంలో నిలిచేలా చేశాడు. ఇక మర్ఫీ ఔట్​ అయిన కాసేపటికే.. బౌండరీ లైన్‌ వద్ద స్టోక్స్‌ క్యాచ్​కు కమిన్స్​ చిక్కాతడు. దీంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఇదీ చూడండి :

కమిన్స్​ సేన షాకింగ్​ నిర్ణయం.. 11 ఏళ్లలో తొలిసారి!

Ashes 2023 : విక్టరీ రన్​ను ఎంజాయ్​ చేసిన కమిన్స్​.. హెల్మెట్‌, బ్యాట్​ను విసిరేసి మరి..!

ABOUT THE AUTHOR

...view details