తెలంగాణ

telangana

Bigg boss Telugu 5: 'నేను డ్రామా క్వీన్‌ కాదు'.. చిందులేసిన అనీ

By

Published : Oct 13, 2021, 9:37 AM IST

Updated : Oct 13, 2021, 10:59 AM IST

Bigg boss Telugu 5
బిగ్​బాస్​ 5 తెలుగు

నామినేషన్​ పర్వంతో బిగ్​బాస్​ (Bigg boss Telugu 5) ఇంట్లో చెలరేగిన హీట్​ కాస్తా చల్లారింది. ఎవరు ఎందుకు నామినేట్ చేశారు? అనే దానిపై అందరూ చర్చించున్నారు. వీటిలో పలు ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చాయి. షణ్ముఖ్‌-జెస్సీల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. బొమ్మల టాస్క్‌సందర్భంగా అనీ మాస్టర్‌ కోపంతో ఊగిపోవడం వల్ల.. సిరికీ, ఆమెకు మధ్య వాగ్వాదం జరిగింది. 'నాకు డ్రామాలు ఆడటం రాదు. నేను డ్రామా క్వీన్‌ కాదు' అంటూ అనీ చిందులేసింది.

నామినేషన్స్‌ సందర్భంగా హౌస్‌మేట్స్‌ మధ్య బిగ్‌బాస్‌ (Bigg boss Telugu 5) పెట్టిన మంట నెమ్మదిగా చల్లారింది. తమని ఎవరు? ఎందుకు నామినేట్‌ చేశారో గ్రూపులుగా విడిపోయి చర్చించుకున్నారు. 'సీక్రెట్‌ నామినేషన్‌ (Telugu Bigg Boss 5 Nomination) అయితే, 8 మంది చేశారు. ఇప్పుడు ఇద్దరు మాత్రమే చేశారు' అంటూ షణ్ముఖ్‌, జెస్సీ చర్చించుకున్నారు. 'ప్రతివారం నన్ను నామినేట్‌ చేస్తానని సన్నీ చెబుతున్నాడు. నన్ను బెదిరించాలనుకుంటున్నాడా? అతడికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తాడు కదా' అంటూ ప్రియాంక వద్ద ప్రియ వాపోయింది. 'ప్రతిసారీ తనని స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అంటూ సరైన కారణం లేకుండా నామినేట్‌ చేయడం వల్లే అనీ మాస్టర్‌ను నామినేట్‌ చేశా' అంటూ శ్రీరామ్‌కు విశ్వ చెప్పాడు. 'ఐన్‌స్టీన్‌ E=mc2 ఎందుకు కనిపెట్టాడో కూడా కనుక్కోవచ్చు. కానీ ఎలిమినేషన్స్‌ అర్థంకావు' అని అంటూ షణ్ముఖ్‌-జెస్సీల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

నామినేషన్స్‌ (Telugu Bigg Boss 5 Nomination) సందర్భంగా శ్రీరామ్‌, కాజల్‌ల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. బెడ్‌రూమ్‌లో ఉన్న కాజల్‌ దగ్గరకు శ్రీరామ్‌ వెళ్లగా.. 'బ్రేకప్‌ బ్రో.. చరిత్రలో బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ బ్రేకప్‌ ఫస్ట్‌ టైమ్‌ కదా' అంటూ నవ్వుతూ చెప్పింది. దాన్ని కామెడీగానే స్వీకరించి శ్రీరామ్‌.. అవునవును అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

అమ్మో బొమ్మ.. 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ'

ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే గేమ్‌ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంట్స్‌ అంతా నాలుగు టీమ్‌లుగా విడిపోయారు. బ్లూ టీమ్‌: మానస్‌, సన్నీ, అనీ మాస్టర్‌; ఎల్లో టీమ్‌: షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ; రెడ్‌ టీమ్‌:విశ్వ, శ్రీరామ్‌, ప్రియ; గ్రీన్‌ టీమ్‌:రవి, లోబో, శ్వేతలు ఉన్నారు. ఇక సిరి, కాజల్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌, సంచాలకులుగా వ్యవహరిస్తారని చెప్పారు బిగ్ బాస్. రెడ్, గ్రీన్ జట్టులకు మేనేజర్‌గా సిరి.. బ్లూ, ఎల్లో జట్లకు కాజల్ మేనేజర్‌గా వ్యవహరించారు. నాలుగు టీమ్‌లు తయారు చేసే బొమ్మల నాణ్యతని పరిశీలించి ఎటువంటి లోపాలు లేకుండా ఉన్నవాటిని ఎంపిక చేయడం వీరి విధి. కెప్టెన్సీ పోటీ దారులు అవ్వాలంటే.. ప్రతి టీమ్‌ ప్రత్యర్థుల కంటే ఎక్కువ బొమ్మలు తయారు చేయాల్సి ఉంటుంది.

ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్‌ ఏరియాలో ఉన్న కన్వేయర్‌ బెల్ట్‌పై నుంచి బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్‌ వస్తుంది. వాటిని తీసుకొని బొమ్మలను తయారు చేయాల్సి ఉంటుంది. గెలిచిన టీమ్​కు మేనేజర్‌గా ఉన్నవాళ్లకి కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బెల్టుపై వచ్చే బొమ్మల రా మెటీరియల్‌ కోసం హౌస్‌మేట్స్‌ ఒకరినొకరు తోసుకున్నారు. లోపలి నుంచి రా మెటీరియల్‌ బయటకు రావడం ఆలస్యం.. లాక్కెళ్లి బొమ్మలు తయారు చేయడం మొదలు పెట్టారు. బొమ్మల్లో కాటన్ సరిగా పెట్టకపోవడం వల్ల.. ఇదో పత్తేపారం.. బొమ్మల్లో పత్తి లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు అంటూ మానస్ పంచ్ వేశాడు. షణ్ను టీమ్‌లో ఉన్న ప్రియాంక బాత్రూమ్‌లోకి వెళ్లి బొమ్మలు కుట్టే ప్రయత్నం చేయగా, బిగ్‌బాస్‌ అక్షింతలు వేశాడు. బాత్రూమ్‌ నుంచి బయటకు రావాల్సిందిగా ఆదేశించాడు.

బొమ్మల టాస్క్‌ (Telugu Bigg Boss Task) సందర్భంగా అనీ మాస్టర్‌ కోపంతో ఊగిపోయింది. సిరికీ, ఆమెకు మధ్య వాగ్వాదం జరిగింది. 'నాకు డ్రామాలు ఆడటం రాదు. నేను డ్రామా క్వీన్‌ కాదు' అంటూ అనీ చిందులేసింది. దీంతో చిన్నబుచ్చుకున్న సిరి.. 'నేను ఆట బాగా ఆడినప్పటికీ.. ఒక టీమ్‌(షణ్ను ఉన్న ఎల్లో టీమ్‌)కే సపోర్ట్‌ చేస్తున్నానని అంటున్నారు.. ఇకపై అలానే ఆడతాను. ఇప్పుడు నా చేతుల్లో గేమ్ ఉంది.. నేను ఆడతా' అని సిరి అనగా.. షణ్ముఖ్‌ సర్ది చెప్పాడు. ఇక ఈ టాస్క్‌లో గ్రీన్‌ టీమ్‌ సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్‌ పవర్ లభించింది. స్పెషల్ బొమ్మ రావడం వల్ల దాని ద్వారా వేరే టీమ్ దగ్గర ఉన్న బొమ్మల్ని తీసుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. మరి ఈ బీబీ బొమ్మల టాస్క్‌లో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే!

ఇదీ చూడండి:RGV Twitter Latest: మైసమ్మకు విస్కీ తాగించిన ఆర్జీవీ.. అలా ఎందుకు చేశాడంటే..?

Last Updated :Oct 13, 2021, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details