తెలంగాణ

telangana

Sudheer Rashmi: రష్మీ కోసం సుడిగాలి సుధీర్​ మరోసారి..

By

Published : Sep 3, 2021, 9:19 PM IST

బుల్లితెర లవ్​లీ జోడీ సుధీర్​-రష్మీ(Sudheer Rashmi) మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వినాయక చవితి రోజు(vinayaka chavithi 2021) ఈటీవీ ప్రోగ్రాంలో జంటగా సందడి చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో అలరిస్తోంది.

sudheer rashmi
సుధీర్ రష్మి

ఈటీవీ వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రాం 'ఊరిలో వినాయకుడు'(Oorilo Vinayakudu) కొత్త ప్రోమో వచ్చేసింది. ఆద్యంతం అలరిస్తూ ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచేస్తోంది. గెస్ట్​గా విచ్చేసిన హీరో శ్రీకాంత్.. సుడిగాలి సుధీర్​(Sudigaali sudheer), హైపర్ ఆదిపై(hyper adhi) వేసిన పంచులు తెగ నవ్విస్తున్నాయి.

శ్రీకాంత్ ఎవరి టీమ్​లో వెళ్తారు అని సుధీర్​ అడగ్గా.. రోజా, ఇంద్రజ(indraja) తమ తమ టీమ్​లలోకి రావాలంటూ శ్రీకాంత్​ను చెరోపక్కకు చేతులు పట్టుకుని లాగారు. చివరగా రోజా బృందంలోకి శ్రీకాంత్ చేరారు.

శ్రీకాంత్-రోజా-ఇంద్రజ

చాలారోజుల తర్వాత సుధీర్​ మరోసారి పాట పాడారు. 'రేసుగుర్రం'లోని 'స్పందన' సాంగ్​ను రష్మి చూస్తూ, రేవంత్​తో కలిసి ఆలపించాడు. రోజా, రాకెట్ రాఘవ, గెటప్​ శీను, ఆటో రాంప్రసాద్​ల పిల్లలతో కలిసి రాకింగ్ రాకేష్​ స్కిట్​ చేశాడు.

సుధీర్ రష్మి

జడ్జి రోజా.. మరోసారి డ్యాన్స్ చేశారు. 'బావను నువ్వు భామను నేను' పాటకు తనదైన గ్రేస్​తో స్టెప్పులు వేశారు. ఇది కాస్త ఆకట్టుకుంటోంది. దీనితో పాటు పూర్ణ, రష్మి, సుధీర్​ తదితరులు కూడా కాలు కదిపి నృత్యం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details