తెలంగాణ

telangana

'కేజీఎఫ్' దర్శకుడితో ప్రభాస్.. ప్రకటన ఎప్పుడంటే?

By

Published : Nov 2, 2020, 9:15 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్​ కాంబోలో ఓ సినిమా రాబోతుందని సమాచారం. దీనిపై వచ్చే ఏడాది ఏప్రిల్​లో ఓ స్పష్టత రానుందట.

Will Prabhas team up with KGF director Prashanth Neel?
కేజీఎఫ్ దర్శకుడితో ప్రభాస్.. ప్రకటన ఎప్పుడంటే?

'బాహుబలి' నటుడు ప్రభాస్‌, 'కేజీఎఫ్‌' దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కలిస్తే ఎలా ఉంటుంది. ఇండియా మొత్తం అబ్బురపడేలా ఉంటుంది. అలాంటిది నిజంగా వీరిద్దరూ ఓ సినిమా తీస్తే అద్భుతం. హీరో ప్రభాస్‌.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ వార్త అధికారికంగా ప్రకటించనప్పటికీ, వచ్చే ఏడాది ఏప్రిల్‌ మాసంలో దీనిపై ఓ స్పష్టత వస్తుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ప్రశాంత్‌ చెప్పిన కథకు ప్రభాస్‌ ఇప్పటికే అమోదం తెలిపారని చెప్పుకుంటున్నారు. 'కేజీఎఫ్‌' సీక్వెల్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న హోంబాలే సంస్థనే ఈ సినిమా నిర్మించనుందట. ప్రస్తుతం ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' చిత్రం చేస్తున్నారు. ఆ తరువాత ఓం రౌత్‌ 'ఆదిపురుష్‌'తో పాటు‌ నాగ్ అశ్విన్​తో ఓ సైన్ ఫిక్షన్​ మూవీకి ఒప్పుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details