తెలంగాణ

telangana

కత్రినాతో నిశ్చితార్థం.. విక్కీ మాట ఇదే

By

Published : Oct 17, 2021, 5:28 PM IST

బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్​- నటి కత్రినా కైఫ్​(Vicky Katrina Engagement) ప్రేమలో ఉన్నారని, వారిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిందంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన విక్కీ ఏమన్నారంటే..

vikcy
విక్కీ కౌశల్​

బాలీవుడ్ యువనటుడు విక్కీ కౌశల్(Vicky Kaushal News).. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో విలక్షణ కథలతో దూసుకెళ్తున్నారు. బాలీవుడ్ బార్బీ కత్రినా కైఫ్​తో(Vicky Katrina relationship) ఆయన ప్రేమయాణం సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో వీరిద్దరికీ ఎంగేజ్​మెంట్​ కూడా జరిగినట్లు రూమర్స్​ వచ్చినప్పటికీ వాటిని కొట్టిపారేశారు విక్కీ సోదరుడు సన్నీ కౌశల్​.

తాజాగా దీనిపై స్పందించిన విక్కీ.. త్వరలోనే తన నిశ్చితార్థం జరుగుతుందని చెప్పారు. అయితే కత్రినాతోనేనా అనేది క్లారిటీ ఇవ్వలేదు! విక్కీ నటించిన కొత్త సినిమా 'సర్దార్​ ఉద్ధమ్'. దీని​ ప్రమోషన్స్​లో పాల్గొన్న ఆయన్ను.. 'కత్రినాకైఫ్​తో మీకు ఎంగేజ్​మెంట్​ జరుగుతుందని ప్రచారం సాగుతోంది. ఎప్పుడు చేసుకుంటున్నారు?' అని ఓ విలేఖరి అడిగారు. "మీ స్నేహితులే ఈ వార్తను ప్రచారం చేస్తున్నారు(నవ్వుతూ). త్వరలోనే సరైన సమయం చూసి ఎంగేజ్​మెంట్​ చేసుకుంటాను. ఆ టైమ్​ త్వరలోనే వస్తుంది" అని అన్నారు.

2019 నుంచి విక్కీ-కత్రినా(Vicky Kaushal engagement) ప్రేమలో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై వీరిద్దరూ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

​కొంతకాలం క్రితం విక్కీ కౌశల్-కత్రినా కైఫ్(Vicky Kaushal Katrina Kaif) ప్రేమ వ్యవహారంపై స్పందించాడు నటుడు హర్షవర్ధన్ కపూర్. ఈ జంట ప్రేమలో ఉన్నది నిజమేనని చెప్పాడు​. 'సినీ ఇండస్ట్రీలో నిజమైన రిలేషన్​షిప్​ ఎవరిది?' అని అడిగిన ప్రశ్నకు 'విక్కీ, కత్రిన కలిసున్నారనేది నిజం' అని బదులిచ్చాడు. తక్షణమే 'ఇది చెప్పినందుకు నేనేమైనా ఇబ్బందుల్లో పడతానా?' అని అన్నాడు.

ఇదీ చూడండి: విక్కీ-కత్రినా కైఫ్​ ఎంగేజ్​మెంట్.. నిజమెంత?

ABOUT THE AUTHOR

...view details