తెలంగాణ

telangana

కత్రినాతో నిశ్చితార్థం- విక్కీ ఫ్యామిలీ ఏమన్నారంటే!

By

Published : Sep 11, 2021, 11:11 AM IST

Updated : Sep 11, 2021, 11:47 AM IST

బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్​- నటి కత్రినా కైఫ్​కు(Vicky Katrina Engagement) నిశ్చితార్థం జరిగిందంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన విక్కీ సోదరుడు సన్నీ కౌశల్.. అందులో ఎలాంటి నిజంలేదని స్పష్టం చేశారు.

vicky katrina
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్

బాలీవుడ్ యువనటుడు విక్కీ కౌశల్(Vicky Kaushal News).. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో విలక్షణ కథలతో దూసుకెళ్తున్నారు. బాలీవుడ్ బార్బీ కత్రినా కైఫ్​తో(Vicky Katrina relationship) ఆయన ప్రేమయాణం సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వీరిద్దరికీ ఎంగేజ్​మెంట్​ కూడా జరిగినట్లు బాలీవుడ్​ కోడై కూస్తోంది. తాజాగా దీనిపై స్పందించారు విక్కీ సోదరుడు సన్నీ కౌశల్. ఈ ఊహాగానాలపై తమ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారో తెలిపారు.

మొదటిసారి ఆ వార్త తెలియగానే తమ కుటుంబసభ్యులంతా తెగ నవ్వేశారని సన్నీ కౌశల్ అన్నారు. తర్వాత విక్కీని కాసేపు ఆటపట్టించినట్లు నవ్వుతూ చెప్పారు.

"తనపై రూమర్స్​ ప్రారంభమైన ఉదయం విక్కీ కౌశల్​ జిమ్​కు​ వెళ్లాడు. ఆరోజు నాకు ఇంకా గుర్తుంది. విక్కీ ఇంటికి తిరిగొచ్చాక.. నీ నిశ్చితార్థం అయిపోయిందంటగా మాకు స్వీట్లు తినిపించు అని అడుగుతూ అమ్మ నాన్న.. విక్కీని ఆటపట్టించారు. ఇందుకు సమాధానంగా.. నిజమైన నిశ్చితార్థం అయినప్పుడే స్వీట్లు తినిపిస్తా అని విక్కీ అన్నాడు." అని చెప్పారు సన్నీ కౌశల్.

2019 నుంచి విక్కీ-కత్రినా(Vicky Kaushal engagement) ప్రేమలో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై వీరిద్దరూ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

విక్కీ-కైఫ్

​కొంతకాలం క్రితం విక్కీ కౌశల్-కత్రినా కైఫ్(Vicky Kaushal Katrina Kaif) ప్రేమ వ్యవహారంపై స్పందించాడు నటుడు హర్షవర్ధన్ కపూర్. ఈ జంట ప్రేమలో ఉన్నది నిజమేనని చెప్పాడు​. 'సినీ ఇండస్ట్రీలో నిజమైన రిలేషన్​షిప్​ ఎవరిది?' అని అడిగిన ప్రశ్నకు 'విక్కీ, కత్రిన కలిసున్నారనేది నిజం' అని బదులిచ్చాడు. తక్షణమే 'ఇది చెప్పినందుకు నేనేమైనా ఇబ్బందుల్లో పడతానా?' అని అన్నాడు.

ఇదీ చదవండి:విక్కీ-కత్రినా కైఫ్​ ఎంగేజ్​మెంట్.. నిజమెంత?

Last Updated :Sep 11, 2021, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details