సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అన్నాత్తే, శాకుంతలం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, అనుభవించు రాజా, హమ్ దో హమారే దో, ద లేడీ కిల్లర్, చోర్ బజార్, తగ్గేదే లే, ఇటర్నల్స్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.
*సూపర్‌స్టార్ రజనీకాంత్ 'అన్నాత్తే' టీజర్‌కు టైమ్ ఫిక్స్ అయింది. అక్టోబరు 14 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. శివ దర్శకుడు.
*హీరోయిన్ సమంత(samantha husband) టైటిల్ రోల్ చేసిన కొత్త సినిమా 'శాకుంతలం'(shaakuntalam movie). ఇటీవల షూటింగ్ పూర్తవగా, సోమవారం నుంచి డబ్బింగ్ ప్రారంభించారు. మహాభారతం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దేవ్‌మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నారు.
*అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'(most eligible bachelor release date) నుంచి 'చిట్టి అడుగు' లిరికల్ సాంగ్ రిలీజైంది. దసరాకు థియేటర్లలోకి రానుందీ సినిమా. నాగచైతన్య(naga chaitanya movies) చేతుల మీదుగా రాజ్‌తరుణ్ 'అనుభవించు రాజా' టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.
*రాజ్‌కుమార్ రావ్, కృతిసనన్ 'హమ్ దో హమారే దో'(hum do hamare do 2021) ట్రైలర్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. కన్ఫ్యూజన్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. అక్టోబరు 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సినిమా స్ట్రీమింగ్ కానుంది. అర్జున్ కపూర్(arjun kapoor movies) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు 'ద లేడీ కిల్లర్' టైటిల్ పెట్టడం సహా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. అజయ్ భల్ దర్శకత్వం వహిస్తున్నారు.
*ఆకాశ్ పూరీ 'చోర్ జజార్' హీరోయిన్గా గెహనా సిప్పీ నటిస్తోంది. ఆమెకు పుట్టినరోజు విషెస్ చెబుతూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నవీన్ చంద్ర హీరోగా 'తగ్గేదే లే' సినిమాను ప్రకటించారు.
*హాలీవుడ్లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన 'ఇటర్నల్స్'(eternals trailer).. తెలుగు ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. సూపర్‌హీరోలు చేసిన తెగ అలరిస్తోంది. దీపావళి కానుకగా నవంబరు 5న థియేటర్లలో రిలీజ్ కానుందీ సినిమా.
ఇవీ చదవండి: