తెలంగాణ

telangana

లతా మంగేష్కర్​ అంత్యక్రియలు.. అభిమానుల​ కన్నీటి వీడ్కోలు

By

Published : Feb 6, 2022, 7:19 PM IST

దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. ప్రధాని మోదీతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు ఇందులో పాల్గొని ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. కేంద్ర ప్రభుత్వం.. ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించింది.

lata mangeshkar last rites
లతా మంగేష్కర్

దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబయిలోని శివాజీ పార్క్​లో ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకు తుది వీడ్కోలు పలికారు. అంతకు ముందు ఆమె మరణవార్త విని ప్రజలతో పాటు ఎంతో మంది నటీనటులు, ప్రముఖులు.. సోషల్ మీడియా వేదికగా ఆమె సంతాపం వ్యక్తం చేశారు. లత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

లత పార్థివ దేహంపై భారత జాతీయ జెండా కప్పి, ఆదివారం సాయంత్రం అంతిమయాత్ర నిర్వహించారు. లత ఇంటి నుంచి శివాజీ పార్క్​ వరకు జరిగిన ఈ అంతిమయాత్రలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శరద్​ పవార్​తో పాటు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వేలాది మంది అభిమానులు కూడా పాల్గొని లతకు ఘనమైన నివాళి అర్పించారు.

లతా మంగేష్కర్ అంతిమయాత్ర

92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details