తెలంగాణ

telangana

కార్తీ సినిమాకు సమంత గ్రీన్​సిగ్నల్​!

By

Published : Feb 1, 2022, 7:35 AM IST

Samantha karthi movie: తమిళ హీరో కార్తి నటించనున్న కొత్త సినిమాకు హీరోయిన్​ సమంత గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, మలయాళ హీరో దుల్కర్​ సల్మాన్​ నటించనున్న ఓ వెబ్​సిరీస్​కు 'గన్స్​ అండ్​ గులాబ్స్'​ టైటిల్​ ఖరారు చేసినట్లు సమాచారం.

Samantha karthi movie
Samantha karthi movie

Samantha Karthi movie: సమంత జోరుగా సాగుతోంది. ఇటు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు అంగీకరిస్తూ బిజీగా గడుపుతోంది. తాజాగా ప్రముఖ తమిళ కథానాయకుడు కార్తి సరసన నటించేందుకు ఆమెను సంప్రదించినట్లు కోలీవుడ్‌ సమాచారం. తమిళ చిత్రం ‘బ్యాచిలర్‌’తో గుర్తింపు తెచ్చుకున్న సతీష్‌ సెల్వకుమార్‌ తన తర్వాత చిత్రం కార్తితో చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్క్రిప్టు సిద్ధమైంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. కార్తి సరసన నాయికగా సమంతను సంప్రదించిందట చిత్రబృందం.

Dulquer salman webseries: ప్రస్తుతం నాయకానాయికలంతా ఓటీటీ వేదికల వైపు దృష్టి సారిస్తున్నారు. మంచి కథ దొరికిందంటే చాలు డిజిటల్‌ వేదికలపైనా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దుల్కర్‌ సల్మాన్‌ ఓటీటీ బాట పట్టారు. ‘ఫ్యామిలీమెన్‌’ ఫేం రాజ్‌ - డీకే ద్వయంతో ఓ వెబ్‌సిరీస్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందిస్తున్న ఈ సిరీస్‌కు ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు సమాచారం. వినోదాత్మకంగా సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సిరీస్‌ రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో దుల్కర్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు, ఆదర్స్‌ గోరవ్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సిరీస్‌ చిత్రీకరణ త్వరలో మొదలుకానుంది. దుల్కర్‌ ప్రస్తుతం తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘లెఫ్టినెంట్‌ రామ్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో నటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details