తెలంగాణ

telangana

సమంత అలాంటి పాత్రలు చేయడానికి కారణమిదే!

By

Published : Oct 26, 2019, 7:01 AM IST

Updated : Oct 26, 2019, 11:34 AM IST

టాలీవుడ్​ స్టార్​ నటి సమంత... పెళ్లి తర్వాత జోరు పెంచింది. గ్లామరస్ పాత్రలు తగ్గించి నటనకు ప్రాధాన్యం ఉన్న కథలపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. వరుస విజయాలతో పాటు మంచి నటిగా గుర్తింపు పొందిన ఈ భామ... తన కెరీర్​ విజయం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టింది.

సమంత అలాంటి పాత్రలు చేయడానికి కారణమిదే!

'రంగస్థలం', 'మహానటి', 'అభిమన్యుడు' వంటి హిట్లతో గతేడాదంతా జోరు చూపించిన సమంత.. 'మజిలీ', 'ఓ బేబీ' వంటి విజయాలతో ఈ ఏడాదినీ అంతే ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తోంది. కెరీర్‌ తొలినాళ్లలో ఎక్కువగా గ్లామర్‌ పాత్రలతోనే మెప్పించిన ఈ భామ.. తనకంటూ ఓ స్టార్‌డమ్​ వచ్చాక నటనా ప్రాధాన్య చిత్రాలనే చేస్తోంది. ఈ విధంగా తన కెరీర్‌ను టర్న్‌ చేసుకోవడం వెనుక ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది సామ్‌.

సమంత

" చిత్రసీమలోకి వచ్చిన తొలినాళ్లలో నా దృష్టి అంతా అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలి. ఏ తరహా పాత్రల్లో నటిస్తే అభిమానులు నన్ను ఇష్టపడతారు. అసలు వాళ్లు నా నుంచి ఏం కోరుకుంటున్నారు అనే విషయాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఎంచుకునేదాన్ని. కానీ నాకు ఓ స్టార్‌డమ్ వచ్చాక నా మనసుకు నచ్చిన పాత్రలే చేస్తున్నా. అంతకు ముందు చేసినవన్నీ ప్రేక్షకులను సంతృప్తి పరచడానికి చేసిన పాత్రలైతే.. ఇప్పుడు చేస్తున్నవన్నీ నటిగా నన్ను నేను సంతృప్తి పరచుకోవడానికే. అదృష్టవశాత్తూ నా అభిరుచికి తగ్గట్లుగా ఎంచుకుంటున్న పాత్రలు అభిమానులను మెప్పిస్తున్నాయి. అందువల్లే నాకు మరింత ఎక్కువ సంతృప్తిగా అనిపిస్తోంది. నా సినీ ప్రయాణాన్ని ఇలానే కొనసాగిస్తా"

-- సమంత, టాలీవుడ్​ నటి

ఇప్పటివరకు అన్నీ పాజిటివ్ పాత్రలే చేసిన సమంత... త్వరలో ఓ నెగిటివ్ రోల్‌లో కనిపించనుందట. అయితే అది వెండితెరపై కాదు.. డిజిటల్ స్క్రీన్‌పై. అమెజాన్ ప్రైమ్‌లో సూపర్ హిట్ అయిన తెలుగు వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మెన్'. ఈ సిరీస్ రెండో సీజన్‌లో సమంత నటిస్తోంది. ఇందులో ఆమె విలన్ పాత్ర పోషిస్తుందని సమాచారం. ఇందులో టెర్రరిస్ట్‌గా కనిపించబోతోందని వార్తలు వస్తున్నాయి.

Last Updated : Oct 26, 2019, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details