తెలంగాణ

telangana

'ఆర్ఆర్ఆర్' రిలీజ్​కు కౌంట్​డౌన్.. 'మహాన్' ట్రైలర్ మాస్

By

Published : Feb 3, 2022, 3:57 PM IST

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, మహాన్, గంగూబాయ్ కతియావాడి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

RRR movie mahaan trailer
ఆర్ఆర్ఆర్ మూవీ మహాన్ ట్రైలర్

RRR movie: ఆర్ఆర్ఆర్ రిలీజ్​కు మరో 50 రోజులే ఉందని చెబుతూ చిత్రబృందం కొత్త ఫొటో పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా షూటింగ్​కు సంబంధించిన ఓ పిక్​ను ట్వీట్ చేసింది.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్టిల్

రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాత.

Mahaan trailer: కోలీవుడ్‌ స్టార్ హీరో విక్రమ్‌, ఆయన తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ కలిసి నటించిన చిత్రం 'మహాన్‌'. సిమ్రన్‌, సింహా, సనంత్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 10న నేరుగా ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలకానుంది. ఈ సందర్భంగా గురువారం, సినిమా ట్రైలర్‌ విడుదలైంది.

విక్రమ్‌ అభిమానులు కోరుకునే మాస్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ప్రచార చిత్రాన్ని బట్టి ఈ సినిమా.. మద్యనిషేధ పోరాటం చుట్టూ తిరిగే కథగా అనిపిస్తుంది. మద్యనిషేధ ఉద్యమ వీరుడి తనయుడైన విక్రమ్ అదే మద్యాన్ని గ్రామ ప్రజలందరికీ దొంగచాటుగా సరఫరాచేస్తుంటాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన విక్రమ్‌ అలా ఎందుకు చేశాడు? అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.

Gangubai kathiawadi ajay devgan: 'గంగూబాయ్ కతియావాడి' సినిమాలో కీలకపాత్రలో నటించిన అజయ్ దేవ్​గణ్ ఫస్ట్​లుక్​ను గురువారం రిలీజ్ చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో గంగూబాయ్​గా ఆలియా భట్ నటించింది. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

అజయ్ దేవ్​గణ్ ఫస్ట్​లుక్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details