RRR censor review: 'మైండ్​ బ్లోయింగ్​.. ఎన్టీఆర్​ నటన టాక్​ ఆఫ్​ ది టౌన్​'

author img

By

Published : Jan 13, 2022, 1:30 PM IST

ఆర్​ఆర్​ఆర్​ సెన్సార్​ రివ్యూ, RRR censor review

RRR censor review: ఎన్టీఆర్​, రామ్​చరణ్​ నటించిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా సెన్సార్​ రివ్యూ అంటూ ఓ ట్వీట్​ సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఈ చిత్రం మైండ్​ బ్లోయింగ్​గా ఉందంటూ సెన్సార్​ పెర్కొందని యూఏఈ సెన్సార్​ బోర్డు సభ్యుడు ఉమైర్​ సంధు ఈ ట్వీట్​ చేశారు.

RRR censor review: పరిస్థితి అంతా బాగుండి ఉంటే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్' ​ఇప్పటికే విడుదలై బాక్సాఫీస్​ ముందు రికార్డులు సృష్టించేది. జనవరి 7న విడుదవ్వాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడీ చిత్ర సెన్సార్​ రివ్యూ అంటూ ఓ ట్వీట్​ సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

యూఏఈ సెన్సార్​ బోర్డు సభ్యుడు ఉమైర్​ సంధు.. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. 'మైండ్​ బ్లోయింగ్​'గా ఉందంటూ సెన్సార్​ పేర్కొందని ట్వీట్​ చేశారు. జూనియర్​ ఎన్టీఆర్​ నటన టాక్​ ఆఫ్​ ది టౌన్​ అని ప్రశంసించారు. ఈ ట్వీటే​ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది. దీంతో ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న అభిమానుల ఉత్సాహం మరింత రెట్టింపు అయింది.

ఆర్​ఆర్​ఆర్​ సెన్సార్​ రివ్యూ, RRR censor review
ఆర్​ఆర్​ఆర్​ సెన్సార్​ రివ్యూ

RRR movie budget: యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామాగా రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్​గా తారక్‌ నటించారు. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్​, పోస్టర్లు, గ్లింప్స్​, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్', 'పుష్ప' ​స్పూఫ్​.. చూస్తే వావ్​​ అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.