తెలంగాణ

telangana

Rashmika: రష్మిక ఇల్లు వెతుక్కుంటూ 900 కి.మీ. ప్రయాణం

By

Published : Jun 23, 2021, 7:24 PM IST

అందాల తార రష్మిక(Rashmika Mandanna)ను కలిసేందుకు తెలంగాణకు చెందిన ఓ అభిమాని ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణించాడు. హీరోయిన్ స్వస్థలమైన కర్ణాటకలోని కొడగు జిల్లాకు అనేక మార్గాల్లో చేరుకొని.. ఆమె నివాసం కోసం వెతుకులాడాడు. అంతలోనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని వెనక్కి పంపారు.

Rashmika fan vainly travels over 900 km to see actress
Rashmika: రష్మిక ఇల్లు వెతుక్కుంటూ 900 కి.మీ. ప్రయాణం

స్టార్​ హీరోయిన్​ రష్మిక(Rashmika)ను కలిసేందుకు ఓ అభిమాని ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేశాడు. తెలంగాణ నుంచి కర్ణాటకలోని కొడగు జిల్లాకు అనేక మార్గాల్లో ప్రయాణించి అక్కడికి చేరుకున్నాడు. కానీ, చివరికి పోలీసుల జోక్యంతో తన అభిమాన హీరోయిన్​ను చూడకుండానే వెనుదిరిగాడు.

ఏం జరిగిదంటే?

తెలంగాణకు చెందిన ఆకాశ్​ త్రిపాఠి(Aakash Tripati).. తన అభిమాన హీరోయిన్ రష్మిక​ను ప్రత్యక్షంగా చూసేందుకు గూగుల్​ సమాచారం ద్వారా కర్ణాటకలోని కొడగు జిల్లాకు చేరుకున్నాడు. అక్కడికి చేరుకునేందుకు తెలంగాణ నుంచి తొలుత మైసూరు వచ్చే రైలు ఎక్కాడు. ఆ తర్వాత సరకు రవాణా చేసే ఆటో ద్వారా రష్మిక స్వస్థలానికి చేరుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్నాక హీరోయిన్ రష్మిక ఇల్లు ఎక్కడని కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగాడు. అనుమనాస్పదంగా కనిపించిన ఆ వ్యక్తి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. హీరోయిన్​ షూటింగ్​ కోసం ముంబయి వెళ్లిందని సదరు వ్యక్తిని వెనక్కిపంపారు.

ఇదీ చూడండి:Sonu Sood: సోనూసూద్ కోసం ముంబయికి యువకుడి పాదయాత్ర

ABOUT THE AUTHOR

...view details