తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద ఫలితాన్ని అందుకున్న చిత్రం 'హిట్'. ప్రస్తుతం హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమౌతోంది. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ ఈ రీమేక్‌లో నటించనున్నాడు. సస్పెన్ష్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పోలీసు పాత్రలో కనువిందు చేయనున్నాడు.
తెలుగులో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన శైలేష్ కొలను.. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. మిస్సయిన ఓ అమ్మాయిని హిట్(హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్) బృందం పట్టుకోగలిగిందా? లేదా? అనేది కథాంశం.
"సినిమా చూడగానే వెంటన్ కనెక్ట్ అయిపోయా. చాలా అద్భుతమైన స్టోరీ. ప్రస్తుతకాలానికి తగ్గట్టుగా కథనం ఉంది. నటుడిగా నేను విభిన్న పాత్రలు చేయాలని అనుకుంటాను. హిట్ చిత్రంతో అలాంటి ఓ అవకాశం వచ్చింది. శైలేష్, దిల్ రాజు గారితో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఉన్నా."
-- రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు
'హిట్' చిత్రానికి గ్లోబల్‌గా ఆకట్టుకునే కథనం ఉందన్న శైలేష్.. చిన్నపాటి మార్పులు చేర్పులతో అందరికీ వర్తిపంజేసేలా చేయొచ్చని అన్నాడు. హిందీ రీమేక్ 2021లో ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకోనుంది. నటీనటులు, సాంకేతిక విభాగం వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటికే నాని నటించి 'జెర్సీ' చిత్రం హిందీలో తెరకెక్కుతోంది. షాహిద్ నటించిన ఈ చిత్రానికి దిల్‌రాజ్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు హిట్ చిత్రంతోనూ మరోసారి బాలీవుడ్ తెరపై అడుగుపెడుతున్నారు.
మరోవైపు.. హిట్ తెలుగు సీక్వెల్‌కీ ప్రయత్నాలు మొదలయ్యాయి. పార్ట్-1 క్లైమాక్స్ లోనే హింట్ ఇచ్చిన డైరెక్టర్.. దానికి తగినట్టుగా స్క్రిప్టు తయారు చేసే పనిలో ఉన్నారు. అయితే ఇందులో విశ్వక్సేన్ నటిస్తాడా? మరో హీరో చేస్తాడా? అనే సంగతి తెలియాల్సి వుంది. హిట్‌ను తెలుగులో నాని తెరకెక్కించగా.. విశ్వక్, రుహానీ శర్మ నటించారు.