తెలంగాణ

telangana

Bheemla nayak songs: 'లా లా భీమ్లా' సాంగ్ ప్రోమో ఆగయా

By

Published : Nov 3, 2021, 7:04 PM IST

Updated : Nov 3, 2021, 7:30 PM IST

'భీమ్లా నాయక్' నుంచి మాస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

PAWAN KALYAN BHEEMLA NAYAK SONG
పవన్​కల్యాణ్

తెలుగు సంగీత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మాస్ గీతం ప్రోమో వచ్చేసింది. 'భీమ్లా నాయక్' సినిమాలోని 'లా లా భీమ్లా..' అంటూ సాగే పాట ప్రోమో వీడియోను బుధవారం(నవంబరు 3) విడుదల చేశారు. మంచి హుషారెత్తిస్తూ, ఫ్యాన్స్​ను ఉర్రూతలూగిస్తోంది.

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్​, పోలీస్​ అధికారిగా నటించారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యమేనన్, సంయుక్త.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది 'భీమ్లా నాయక్' చిత్రం.

ఇవీ చదవండి:

Last Updated : Nov 3, 2021, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details