తెలంగాణ

telangana

ఎన్టీఆర్ కొత్త సినిమా అప్డేట్.. దర్శకుడు ఎవరు?

By

Published : Apr 11, 2021, 6:05 PM IST

సోమవారం(ఏప్రిల్ 12) సాయంత్రం ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే దర్శకుడు ఎవరై ఉంటారా అని ఫ్యాన్స్ తెగ మాట్లాడుకుంటున్నారు.

NTR30 UPDATE ON APRIL 11 EVENING
ఎన్టీఆర్ కొత్త సినిమా అప్డేట్.. దర్శకుడు ఎవరు?

'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. తర్వాత ఏ సినిమా చేస్తారనేది ఇంతవరకు వెల్లడించలేదు. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నింటికీ సోమవారం సాయంత్రం క్లారిటీ రాబోతుంది.

ఎన్టీఆర్​తో త్రివిక్రమ్ సినిమా చేయనున్నారని, గతేడాది అధికారికంగా ప్రకటించారు. కానీ త్రివిక్రమ్, మహేశ్​తో కలిసి పనిచేయనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో తారక్​ను డైరెక్ట్ చేయబోయేది ఎవరా అని ఆయన అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.

అయితే తారక్​తో తర్వాత సినిమా కొరటాలనే చేస్తారని దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈయన కాకపోతే 'ఉప్పెన' అలరించిన బుచ్చిబాబుతో ఎన్టీఆర్​ పనిచేసే అవకాశముంది.

త్రివిక్రమ్​తో ఎన్టీఆర్

ABOUT THE AUTHOR

...view details