తెలంగాణ

telangana

Nani: 'దసరా' మూవీ కోసం అంత ఖర్చుతో భారీ సెట్‌?

By

Published : Jan 27, 2022, 5:19 PM IST

Nani: వరుస సినిమాలతో జోరుమీదున్నాడు కథానాయకుడు నాని. ఆయన నటిస్తోన్న కొత్త చిత్రం 'దసరా'. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 12 కోట్లు ఖర్చు చేసి ఓ విలేజ్​ సెట్​ను రూపొందించనున్నారట మేకర్స్​.

Nani
నాని

Nani: యువ కథానాయకుడు నాని(Nani) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది డిసెంబరులో 'శ్యామ్‌ సింగరాయ్‌'తో మెప్పించిన ఆయన ఇటీవలే 'అంటే సుందరానికీ!' చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే మరో సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న 29వ చిత్రం 'దసరా'. కీర్తిసురేశ్‌ కథానాయిక. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

నాని, కీర్తి సురేశ్

పూర్తి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో నాని డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా విలేజ్‌ సెట్‌ను తీర్చిదిద్దుతోందట. ఇందుకోసం ఏకంగా రూ.12కోట్లు ఖర్చు చేయనున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. మెజార్టీ భాగం ఇక్కడే చిత్రీకరించనున్నారు. దీంతో ఈ విషయంలో చిత్ర బృందం అస్సలు రాజీపడకూడదని భావిస్తోందట.

'శ్యామ్‌ సింగరాయ్‌' కోసం కోల్‌కతాను తలపించేలా సెట్‌ను తీర్చిదిద్దిన ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కొల్ల దీనికి పనిచేస్తున్నారు. గోదావరిఖని మైన్స్‌ నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. అందుకు తగినట్లుగానే సెట్‌ను రూపొందిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు రోషన్‌ మాథ్యూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:కెరీర్​పై తీవ్ర ప్రభావం.. బాధగా ఉంది: హీరో నిఖిల్‌

ABOUT THE AUTHOR

...view details