ETV Bharat / sitara

కెరీర్​పై తీవ్ర ప్రభావం.. బాధగా ఉంది: హీరో నిఖిల్‌

author img

By

Published : Jan 27, 2022, 3:32 PM IST

Nikhil: కరోనా మహమ్మారి కెరీర్​ను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు యువ హీరో నిఖిల్. ట్విట్టర్​ వేదికగా.. తన సినిమాల రిలీజ్​ డేట్​ల విషయంలో గందరగోళం నెలకొందని ఆవేదన చెందారు.

nikhil
నిఖిల్‌

Nikhil: కరోనా మహమ్మారి తన కెరీర్‌పై ఎంతో ప్రభావం చూపుతోందని హీరో నిఖిల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేక్‌ సర్టిఫికెట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'అర్జున్‌ సురవరం' విజయం సాధించిన తర్వాత నిఖిల్‌ వరుస పెట్టి సినిమాలు పట్టాలెక్కించేశారు. ప్రస్తుతం ఆయన 'కార్తికేయ-2', '18 పేజీస్‌' తోపాటు మరో రెండు ప్రాజెక్ట్‌లకు సంతకాలు చేశారు. 'కార్తికేయ-2', '18 పేజీస్‌'ల చిత్రీకరణ చివరిదశలో ఉన్నాయి.

nikhil
18 పేజీస్‌

ఇదిలా ఉండగా కరోనా మూడోదశతో ఇప్పటికే సినీ పరిశ్రమలో పరిస్థితులు ఆగమ్యగోచరంగా మారాయి. సంక్రాంతి రేసు నుంచి పలు భారీ చిత్రాలు వెనక్కి తగ్గాయి. ఆయా చిత్రాలు రానున్న వేసవిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరికొంతమంది స్టార్‌హీరోల సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో యువ హీరోల సినిమాలు సిద్ధమైనప్పటికీ ఎప్పుడు రిలీజ్‌ చేయాలనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే నటుడు నిఖిల్‌ కూడా తన తదుపరి సినిమాల రిలీజ్‌లపై ఆందోళన చెందుతున్నారు.

"కరోనా మహమ్మారి కెరీర్‌పై ఇంతలా ప్రభావం చూపించడం చూస్తే నాకెంతో బాధగా ఉంది. 'అర్జున్‌సురవరం' విజయం సాధించిన తర్వాత నేను నాలుగు సినిమాలకు సంతకం చేశాను. ఆ నాలుగు కూడా ఎంతో అద్భుతమైన స్క్రిప్ట్‌లు. వాటి విజయంపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. కానీ, ఇప్పుడు రిలీజ్‌ డేట్‌ల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ సమస్యలన్నీ త్వరితగతిన తొలగిపోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. తద్వారా మా సినిమాలను సక్రమంగా విడుదల చేసుకోవచ్చు" అని గురువారం నిఖిల్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: దొంగతనం కథతో 'ఏటీఎం' వెబ్ సిరీస్.. త్వరలో షూటింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.