తెలంగాణ

telangana

ఓటీటీలో విశాల్ 'చక్ర'​.. గాయనిగా నిత్య

By

Published : Sep 18, 2020, 3:28 PM IST

విశాల్​ హీరోగా నటిస్తున్న 'చక్ర' సినిమాను దీపావళి కానుకగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు 'గమనం' చిత్రంలో నిత్య మేనన్​ ఫస్ట్​లుక్​ విడుదలైంది.

vishal chakra
విశాల్,నిత్య

మాస్ యాక్షన్‌ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే హీరో విశాల్‌. ప్రస్తుతం ఎం.ఎస్‌.ఆనందన్‌ దర్శకత్వంలో 'చక్ర' చేస్తున్నారు. అతడే‌ సొంతంగా నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్​. రెజీనా కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఇప్పుడీ చిత్రాన్ని దీపావళి కానుకగా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.

బ్యాంక్ దొంగతనం, సైబర్ క్రైమ్, సైబర్‌ హ్యాకింగ్‌ ముఠాల గుట్టురట్టు నేపథ్యంలో కథ ఉండనుంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుందీ సినిమా.

సంప్రదాయ గాయనిగా నిత్య

మరోవైపు శ్రియ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'గమనం'. సుజనా రావు దర్శకురాలు. ఇందులో నిత్యా మేనన్‌ కీలక పాత్రధారి. ఆమె ఫస్ట్‌లుక్​ను శుక్రవారం‌ విడుదల చేశారు. ఇందులో సంప్రదాయ గాయని లుక్​లో దర్శనమిచ్చింది నిత్య.

'గమనం' సినిమాలో నిత్య

రమేష్‌ కరుటూరి, వెంకీ పుషదాపు, జ్ఞాన శేఖర్‌ వీఎస్ సంయుక్తంగా‌ నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details