తెలంగాణ

telangana

చిరు తీసిన తొలి ఫొటో: ఇందులో ఉన్న 'స్టార్' ఎవరు?

By

Published : Aug 19, 2020, 7:18 PM IST

'వరల్డ్ ఫొటోగ్రఫీ డే' సందర్భంగా తను తీసిన తొలి ఫోటోను పంచుకున్నారు మెగాస్టార్. ఇందులోని వ్యక్తి మీకు బాగా తెలుసని, ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ అభిమానులకు పరీక్ష పెట్టారు.

megastar chiranjeevi shares his first captured photo
చిరంజీవి తొలి ఫొటో

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సం సందర్భంగా 'అగ్ఫా 3' కెమెరాతో తాను తీసిన తొలి ఫొటోను మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 'ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చూద్దాం' అంటూ అభిమానులకు సవాలు విసిరారు. స్పందిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు.. ఆ పిల్లాడు పవర్​స్టార్ పవన్​కల్యాణ్ అంటూ చెబుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

మొగల్తూరులోని తన సొంత ఇంట్లో చిరు ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఫొటోగ్రఫీ రోజు పవన్​ చిన్నప్పుడు ఎలా ఉండేవారో అభిమానులకు చూపించి, వారిని ఫుల్ ఖుషీ చేశారు.

చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ఫస్ట్​లుక్ మోషన్​ పోస్టర్​ను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22 సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.

ABOUT THE AUTHOR

...view details