తెలంగాణ

telangana

MAA Elections: ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాపై విష్ణు కీలక నిర్ణయం

By

Published : Dec 12, 2021, 12:24 PM IST

Updated : Dec 12, 2021, 1:33 PM IST

vishnu
విష్ణు

12:21 December 12

MAA Elections Prakashraj resignation: 'మా' అధ్యక్షుడు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. 11మంది ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​ సభ్యుల రాజీనామాను ఆమోదించారు. తన ప్యానెల్​ నుంచి ఓడిపోయిన సభ్యులను తిరిగి తన కార్యవర్గంలోకి తీసుకోనున్నట్లు తెలిపారు.

'మా' అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఇందులో మంచు విష్ణుతో పోటీపడి ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోయారు. ప్రకాశ్‌రాజ్‌పై 106 ఓట్ల తేడాతో మంచు విష్ణు గెలుపొందారు. విష్ణుకు 380 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. 'మా' చరిత్రలోనే అత్యధిక పోలింగ్‌ నమోదైంది. 'మా'లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 605మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఫలితాలు వెలువడిన వెంటనే ప్రకాశ్​రాజ్​ 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు అక్టోబర్​ 11న ప్రకటించారు. ఆయనతో పాటే తన ప్యానెల్​లోని 11మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు. అయితే అధ్యక్షుడిగా తాను ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాని అంగీకరించనని అప్పుడు విష్ణు అన్నారు. అనంతరం ఇన్ని రోజులు తర్వాత తాజా నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి: Maa elections 2021: 'విష్ణును రెండేళ్ల వరకు నిద్రపోనివ్వను'

Last Updated : Dec 12, 2021, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details