తెలంగాణ

telangana

పాట కోసం ఆరు కిలోలు తగ్గిన డింపుల్.. ముద్దుపై మీనాక్షి క్లారిటీ

By

Published : Feb 9, 2022, 6:58 AM IST

Khiladi heroines: ఫిబ్రవరి 11న 'ఖిలాడి'.. థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో సినిమా విశేషాలను పంచుకున్నారు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, డింపుల్​ హయాతి.

khiladi movie heroines
ఖిలాడి మూవీ హీరోయిన్స్

Raviteja khiladi movie: 'ఖిలాడి' రవితేజతో జోడీ కట్టిన ఖిలేడీసే.. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి. డింపుల్‌ అచ్చ తెలుగమ్మాయి, మీనాక్షి ముంబయి భామ. 'ఖిలాడి' ట్రైలర్‌ గమనిస్తే ఇద్దరు కథానాయికలూ సినిమాకు కావాల్సినంత గ్లామర్‌ జోడించినట్టు స్పష్టమవుతోంది. రమేశ్​ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు కథానాయికలు మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

మీ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్పమంటే ఏం చెబుతారు?

మీనాక్షి: ఆత్మ విశ్వాసం ఉన్న అమ్మాయి. ఆమెతో కలిసి నటిస్తున్నప్పుడు పక్కనున్న నటులు చాలా సౌకర్యంగా ఫీల్‌ అవుతారు. అందరితోనూ కలిసిపోతుంది. డింపుల్‌తోపాటు, ఇందులో చాలా మంది నటులు ఉన్నారు. వాళ్లందరితో కలిసి పనిచేయడం చక్కటి అనుభవం.

ఖిలాడి మూవీ రివ్యూ

డింపుల్‌: మీనాక్షి కష్టపడి పైకి వచ్చిన కథానాయిక. ఎంతో ఒదిగి ఉంటుంది. తను పాల్గొన్న మిస్‌ దివా పోటీల్లో నేనూ పాల్గొన్నా. నేను మధ్యలోనే తప్పుకొన్నా. తను ఫైనల్‌ వరకు వెళ్లి టైటిల్‌ గెలుచుకుంది. తనతో కలిసి నటించాలన్నప్పుడు రిజర్వ్‌గా ఉంటుందేమో అనుకున్నా, కానీ తను అలా లేదు. చక్కగా కలిసిపోయింది.

ఈ సినిమా ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

మీనాక్షి: రవితేజ కామెడీ టైమింగ్‌ పక్కాగా ఉంటుంది. అందుకోసం చాలా హోం వర్క్‌ చేశా. తెలుగులో సంభాషణలు చెప్పడం నాకో పెద్ద సవాల్‌. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నా. కొన్ని సన్నివేశాలు చేస్తున్నప్పుడు బెరుగ్గా కనిపించానంటే నేను మళ్లీ మామూలుగా అయ్యేవరకు సమయం తీసుకోమని చెప్పేవారు రవితేజ. ఆయన అందించే ప్రోత్సాహమే వేరు. ఆద్యంతం ఆస్వాదిస్తూ చేసిన సినిమా ఇది.

డింపుల్‌: యాక్షన్‌ సన్నివేశాల్లో తప్ప సినిమా మొత్తం నేను కనిపిస్తుంటాను. దర్శకుడు రమేశ్ వర్మ ముందే ఆ విషయాన్ని చెప్పారు. 'ఖిలాడి'లో క్యాచ్‌ మి... పాట చేయడానికి ముందు కొంచెం బొద్దుగా ఉన్నా. దర్శకుడు నన్ను బరువు తగ్గాలని చెప్పారు. ఆరు కిలోల బరువు తగ్గాక పాట చేయించారు.

రవితేజ ఖిలాడి మూవీ

గ్లామర్‌ మోతాదు ఎక్కువగానే కనిపిస్తోంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెబుతారు?

మీనాక్షి: వాణిజ్య ప్రధానమైన సినిమా కాబట్టి కొన్ని అంశాలు ఉంటాయి. దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడే నీ పాత్ర ఇలా ఉంటుందని స్పష్టంగా చెప్పారు. వాణిజ్య సినిమా అన్నప్పుడు అందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. ముద్దు మానవీయ భావోద్వేగమే కదా. అయినా అవి తెరపై హద్దులు దాటినట్టేమీ ఉండవు. ముద్దు సన్నివేశాల్నీ నటనలో భాగంగానే చూస్తా.

డింపుల్‌: లంగా ఓణీతో పక్కింటి అమ్మాయిని గుర్తుచేస్తా, అదే సమయంలో ట్రెండీ అమ్మాయిగానూ కనిపిస్తా. పూర్తిస్థాయి మాస్‌ రోల్‌ అంటే ఎలా ఉంటుందో నా పాత్ర చూస్తే తెలుస్తుంది.

స్వతహాగా ఎలాంటి పాత్రల్ని ఇష్టపడతారు?

మీనాక్షి: తెలుగులో ఇది నా రెండో సినిమా. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చేస్తున్నప్పుడే రవితేజతో కలిసి నటించే అవకాశం వచ్చింది. మరో మాట మాట్లాడకుండా అంగీకారం తెలిపా. చిన్న పాత్రలైనా సరే, అందులో బలం ఉంటే తప్పకుండా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి.

మీనాక్షి చౌదరి- డింపుల్ హయాతి

డింపుల్‌: కథానాయిక తెలుగమ్మాయి అనగానే కొన్ని పరిమితులతో ముడిపెట్టి చూస్తుంటారు. నాకు అలా ఇష్టం ఉండదు. నేను నటిని. కథ, అందులో భాగంగా వచ్చే మంచి పాత్ర అనుకుంటే తప్పకుండా చేస్తా.

కొత్త సినిమాల ముచ్చట్లేమిటి?

మీనాక్షి: ‘హిట్‌ 2’లో నటిస్తున్నా. విజయ్‌ ఆంటోనీతో కలిసి ‘కొలై’ సినిమా చేస్తున్నా. అది త్వరలోనే విడుదల కానుంది. మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ‘సలార్‌’లోనూ నటిస్తున్నారట కదా అని అడుగుతున్నారు, ఖరారైన సినిమాల గురించే నేను చెప్పాలి కదా!

డింపుల్‌: కొన్ని సినిమాలు ఒప్పుకొన్నా. ఆ వివరాలు త్వరలోనే నిర్మాణ సంస్థల నుంచే తెలుస్తాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details