ETV Bharat / sitara

రవితేజ మరోసారి సాహసం.. 'ఖిలాడి' డైరెక్టర్ హిట్ కొడతారా?

author img

By

Published : Feb 7, 2022, 9:58 AM IST

Raviteja khiladi movie: అగ్రకథానాయకుడు రవితేజ సాహసం చేస్తున్నారు. తనతో సినిమా తీసి హిట్ కొట్టలేకపోయిన డైరెక్టర్​కు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు?ఆ సినిమా ఏంటి?

raviteja khiladi movie
రవితేజ ఖిలాడి మూవీ

Raviteja Ramesh varma: మాస్​ మహారాజా రవితేజ.. 'ఖిలాడి'గా త్వరలో థియేటర్లలోకి రానున్నారు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రమేశ్ వర్మ.. గతంలో రవితేజతోనే 'వీర' తీశారు. ఆ చిత్రం ప్రేక్షకుల్ని అప్పుడు ఏ మాత్రం అలరించలేకపోయింది! అయినా సరే అతడిపై నమ్మకముంచిన రవితేజ.. మరో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వీరి కాంబినేషన్​లో తెరకెక్కిన 'ఖిలాడి' హిట్​ అవుతుందనే ధీమాతో ఉన్నారు.

raviteja ramesh varma
రమేశ్ వర్మతో రవితేజ

గతంలోనూ తనతో తొలి సినిమాలు తీసి, మెప్పించలేకపోయిన దర్శకులకు రవితేజ అవకాశాలిచ్చారు. ఈ క్రమంలోనే రెండు సందర్భాలు మీకోసం.

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్​గా పలు సినిమాలు తీస్తున్న హరీశ్ శంకర్, తన తొలి సినిమా 'షాక్'.. రవితేజతోనే తీశారు. కానీ అది ఏ మాత్రం ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది. అనంతరం రవితేజ మరో ఛాన్స్ ఇవ్వగా.. 'మిరపకాయ్'తో అతడికి మెమరబుల్ హిట్​ ఇచ్చారు హరీశ్.

కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కూడా తన తొలి సినిమా 'నీకోసం'ను రవితేజ హీరోగా తీశారు. అది మిశ్రమ ఫలితాలు అందుకుంది. అయినా సరే వైట్లపై నమ్మకముంచిన రవితేజ.. మరో ఛాన్స్ ఇచ్చారు. దీంతో 'వెంకీ' అనే అద్భుతాన్ని, ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాను అందించారు.

raviteja khiladi movie
రవితేజ ఖిలాడి మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.