తెలంగాణ

telangana

చరణ్​ చేతుల మీదుగా 'కేజీఎఫ్​2' ట్రైలర్​.. రిలీజ్​ డేట్​తో రామ్​

By

Published : Mar 27, 2022, 12:05 PM IST

Updated : Mar 27, 2022, 1:11 PM IST

KGF 2 Trailer: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. రాకింగ్​ స్టార్​ యశ్​ నటించిన 'కేజీఎఫ్​ 2' ట్రైలర్​ను మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ రిలీజ్ చేయనున్నారు. ఇక రామ్​ పోతినేని నటించిన 'ది వారియర్'​ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

kgf 2 trailer
ram pothineni the warrior release date

KGF 2 Trailer: భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో 'కేజీయఫ్‌2' ఒకటి. కన్నడ చిత్రంగా మొదలై పాన్‌ ఇండియా స్థాయిలో వసూళ్లు సాధించింది 'కేజీయఫ్‌: చాప్టర్‌-1'. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే 'కేజీయఫ్‌2'. కాగా, ఆదివారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కానుంది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌జోహార్‌ ఈ ఈవెంట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను పంచుకుంది. 'కేజీయఫ్‌2' తెలుగు ట్రైలర్‌ను స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది.

చరణ్​ చేతుల మీదుగా 'కేజీఎఫ్​2' తెలుగు ట్రైలర్​

ఆదివారం పుట్టిన రోజు జరుపుకొంటున్న చరణ్‌ ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేయటం సంతోషంగా ఉందని పేర్కొంది. సాయంత్రం 6.40గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇక తమిళ ట్రైలర్‌ను నటుడు సూర్య విడుదల చేస్తారు. 2021 జనవరి 7న యశ్‌ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ విడుదల చేసిన తర్వాత కేజీయఫ్‌2 నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఇప్పుడు ఏకంగా ట్రైలర్‌ విడుదల చేస్తుండటం వల్ల సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ది వారియర్​' రిలీజ్​ డేట్:యువ కథానాయకుడు రామ్‌ కీలక పాత్రలో తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రం 'ది వారియర్‌'. యాక్షన్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జులై 14న విడుదల చేయనున్నట్లు ఆదివారం చిత్ర బృందం తెలిపింది.

'ది వారియర్'

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో రామ్‌ శక్తిమంతమైన పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేకంగా ఐదు భారీసెట్స్‌ను ఈ సినిమా కోసం తీర్చిదిద్దారు. వాటిల్లోనే రామ్‌, ఆది పినిశెట్టి తదితరులపై కీలకమైన పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు.

"రామ్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ గెటప్‌కు మంచి స్పందన లభించింది. కథ డిమాండ్‌ మేరకు ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ప్రత్యేకంగా సెట్లను తీర్చిదిద్దాం. ఫైట్‌ మాస్టర్‌ అన్బు-అరివు నేతృత్వంలో యాక్షన్‌ ఘట్టాలను చిత్రీకరిస్తున్నాం. కర్నూలు నేపథ్యంగా సాగే ఈ యాక్షన్‌ సన్నివేశాలు సినిమాలో కీలకంగా నిలవనున్నాయి" అని చిత్ర బృందం చెబుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి నాయికగా నటిస్తోంది.

ఇదీ చూడండి:పుట్టినరోజున చరణ్ భావోద్వేగం.. 'ఆర్​ఆర్​ఆర్​' సక్సెస్​పై లేఖ

Last Updated : Mar 27, 2022, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details