తెలంగాణ

telangana

సన్నీ లియోనీని విచారించిన కేరళ పోలీసులు

By

Published : Feb 6, 2021, 7:44 PM IST

ముద్దుగుమ్మ సన్నీ లియోనీ పోలీసు స్టేషన్​కు వెళ్లింది. చీటింగ్ కేసు విషయమై ఆమెను ప్రశ్నించారు. అసలు ఏం జరిగింది?

Kerala: Crime Branch records Sunny Leone's statement in financial fraud case
సన్నీ లియోనీ విచారించిన కేరళ పోలీసులు

హాట్ బ్యూటీ సన్నీ లియోనీని కేరళ కోచి పోలీసులు శుక్రవారం రాత్రి విచారించారు. చీటింగ్ కేసు విషయమై ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఓ సినిమా షూటింగ్​లో భాగంగా ప్రస్తుతం సన్నీ కేరళలో ఉంది.

ఇంతకీ ఏం జరిగింది?

కేరళకు చెందిన ఓ ఈవెంట్ సంస్థతో సన్నీ లియోనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2016 నుంచి ఆ రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాలి. అందుకోసం రూ.29 లక్షలు ఆమెకు ఇచ్చారు. కానీ కొన్నాళ్ల తర్వాత తమ ఈవెంట్లలో సన్నీ పాల్గొనట్లేదని సదరు సంస్థ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే నటిని ఇప్పుడు పోలీసులు విచారించారు.

ఇది చదవండి:డిగ్రీ అడ్మిషన్​ లిస్ట్​లో టాపర్​గా సన్నీ లియోనీ

ABOUT THE AUTHOR

...view details