తెలంగాణ

telangana

ఆ బాలీవుడ్‌ చిత్రంతో కీర్తి రిస్క్‌ చేయనుందా?

By

Published : Aug 30, 2021, 7:18 PM IST

'మహానటి'తో అందరి మెప్పు పొందిన కీర్తి సురేశ్ ప్రస్తుతం పూర్తి కమర్షియల్ సినిమాలు చేస్తోంది. అయితే.. ఓ బాలీవుడ్ రీమేక్​ చిత్రంతో కీర్తి రిస్క్​ చేయనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

keerthy suresh
కీర్తి సురేష్

కెరీర్‌ ఆరంభం నుంచే వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది కీర్తి సురేశ్. 'మహానటి'తో అందరి మెప్పు పొందిన ఆమె ప్రస్తుతం పూర్తి కమర్షియల్‌ సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకున్న చిత్రం 'మిమి'. కృతిసనన్‌ కీలక పాత్రలో లక్ష్మణ్‌ ఉత్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అద్దె గర్భంతో ఓ యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? వాటి నుంచి ఎలా బయటపడిందన్న ఇతివృత్తంతో భావోద్వేగభరితంగా ఈ సినిమా సాగుతుంది. ఇందులో కృతిససన్‌ నటనపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు.

తాజాగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తీసేందుకు ఓ నిర్మాణ సంస్థ ప్రయత్నాలు మొదలు పెట్టిందట. ఇందులో భాగంగా కృతిసనన్‌ పాత్ర కోసం కీర్తిని సంప్రదించారట. స్క్రిప్ట్‌ విన్న కీర్తి సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, తుది నిర్ణయాన్ని మాత్రం ఇంకా చెప్పలేదట.

'పెంగ్విన్‌'లో గర్భవతిగా, తల్లిగా కనిపించిన కీర్తి మరోసారి ఈ సినిమాలోనూ అటువంటి పాత్రే పోషించాల్సి రావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాను 'వెల్‌కమ్‌ ఒబామా' పేరుతో తెలుగులో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. మరి 'మిమి'లో ఎలాంటి మార్పులు చేసి, తెలుగు తెరపైకి తీసుకొస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మరోవైపు కీర్తి సురేశ్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉంది. మహేశ్‌తో 'సర్కారు వారి పాట', చిరంజీవితో 'భోళా శంకర్‌', రజనీకాంత్‌తో 'అన్నాత్తే' తదితర చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చదవండి:జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​పై ఈడీ విచారణ

ABOUT THE AUTHOR

...view details