ETV Bharat / sitara

జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​పై ఈడీ విచారణ

author img

By

Published : Aug 30, 2021, 5:38 PM IST

Updated : Aug 30, 2021, 9:39 PM IST

బాలీవుడ్​ నటి జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటోంది.

జాక్వెలిన్​ ఫెర్నాండేజ్
Jacqueline Fernandez

బాలీవుడ్ ప్రముఖ​ నటి జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించింది. దిల్లీలో సుమారు ఐదు గంటలకుపైగా ఈ విచారణ కొనసాగింది. సుకేశ్ చంద్రశేఖర్‌ అనే ఓ వ్యక్తికి సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో సాక్షిగా జాక్వెలిన్​పై విచార చేపట్టారు.

మనీలాండరింగ్​ ద్వారా కోట్లాది రూపాయిలు చేతులు మార్చిన నిందితుడికి సంబంధించి ఫెర్నాండేజ్​ స్టేట్​మెంట్​ను రికార్డ్​ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే చెన్నై సముద్ర తీరంలో ఉండే ఓ బంగ్లాను, రూ. 82.5ల నగదును, డజన్​కు పైగా ఖరీదైన, విలాసవంతమైన కార్లను ఈటీ జప్తు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు రూ. 200 కోట్లలకు పైగా ఉన్న కేసులో నేరానికి పాల్పడినట్లు తెలిపారు.

Last Updated : Aug 30, 2021, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.