తెలంగాణ

telangana

గుడ్​న్యూస్ చెప్పిన కంగనా రనౌత్.. త్వరలో పెళ్లి?

By

Published : Nov 11, 2021, 4:05 PM IST

తనకు కాబోయే వాడి గురించి త్వరలో అందరికీ తెలుస్తుందని నటి కంగనా రనౌత్ చెప్పింది. ఇటీవల ఈమెను అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డు వరించింది.

Kangana Ranaut
కంగనా రనౌత్

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ త్వరలో పెళ్లి చేసుకోనుంది! ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా బుధవారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రాబోయే ఐదేళ్లలో వివాహ బంధంలోకి అడుగుపెట్టడం సహా పిల్లల్ని కనాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇటీవల ఆమెను పద్మశ్రీ వరించింది. దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డును అందుకుంది కంగన.

పద్మశ్రీ అవార్డుతో కంగనా రనౌత్

రాబోయే ఐదేళ్లలో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోబోతున్నారు అంటూ కంగనను అడగ్గా.. 'కచ్చితంగా పెళ్లి చేసుకోవడం సహా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. వచ్చే ఐదేళ్లలో తల్లిని కావాలనుకుంటున్నాను.' అని కంగన చెప్పింది. తనకు కాబోయే వాడి గురించి త్వరలో అందరికీ తెలుస్తుందని తెలిపింది.

ప్రస్తుతం కంగన.. ధాకడ్, తేజస్, అపరాజిత అయోధ్య, సీత, మణికర్ణిక రిటర్న్స్​ సినిమాల్లో నటిస్తోంది. మణికర్ణిక ప్రొడక్షన్స్​లో 'టికూ వెడ్స్ షేరూ' నిర్మిస్తోంది. దీని షూటింగ్ జరుగుతుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details