తెలంగాణ

telangana

హీరోయిన్ కృతిశెట్టిపై ​డైరెక్టర్ ఫైర్.. ఎందుకంటే?

By

Published : Aug 11, 2021, 3:28 PM IST

'ఉప్పెన' సినిమాతో ఆకట్టుకుని వరుస సినిమాలు చేస్తున్న కృతిశెట్టిపై ఆ దర్శకుడు కోప్పడ్డాడు! షూటింగ్​లో భాగంగానే ఇది జరిగింది? ఇంతకీ ఏమైంది?

actress Krithi Shetty
కృతిశెట్టి

'ఉప్పెన'తో బేబమ్మగా తెలుగువారికి చేరువైన నటి కృతిశెట్టి. తన అందచందాలతో మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాలు గెలుచుకున్న ఈ భామ.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. రామ్‌ పోతినేని హీరోగా కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తుంది. ఇందులో ఆదిపినిశెట్టి, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అందుకే ఫైర్..

రామ్​ కొత్త సినిమా బృందం

ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో కృతిశెట్టిపై లింగుస్వామి ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. నాజర్‌-కృతిశెట్టిలపై ఓ ఎమోషనల్‌ సీన్‌ చిత్రీకరించారని.. భావోద్వేగాలను పండించడంలో ఆమె విఫలమయ్యారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గంటపాటు ఎన్నో రీటేక్‌లు తీసుకున్నప్పటికీ సీన్‌ ఓకే కాకపోవడం వల్ల నాజర్‌ అసహనికి గురయ్యారని.. దాంతో లింగుస్వామి ఆమెను తిట్టారని సమాచారం.

శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

ఇవీ చదవండి:

'చెర్రీతో సినిమా చేయాలనేది నా కోరిక!'

అలాంటి వాడు భర్తగా రావాలి: కృతి

ABOUT THE AUTHOR

...view details