తెలంగాణ

telangana

'ఆర్​ఎక్స్ 100' దర్శకుడితో ధనుష్!

By

Published : Sep 10, 2021, 10:10 AM IST

కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్​(Dhanush)​.. తెలుగులో వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టాలీవుడ్​ దర్శకుడు శేఖర్​ కమ్ములతో మూవీ ప్రకటించిన ధనుష్​.. తాజాగా మరికొందరు తెలుగు దర్శకులతో సినిమాలు చేయబోతున్నట్లు టాక్​ వినిపిస్తోంది.

Dhanush
ధనుష్​

విభిన్నమైన పాత్రలతో తమిళ స్టార్​ హీరో ధనుష్(Dhanush)​​ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే వరుసగా తెలుగు సినిమాలు చేసేందుకు ధనుష్ సిద్ధమవుతున్నారు. ఇటీవల టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో పాన్ ఇండియా సినిమా చేసేందుకు ఓకే చెప్పిన ధనుష్(Dhanush new movie)​.. తాజాగా మరికొందరు తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

'ఆర్ఎక్స్ 100' సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతితో సినిమా చేసేందుకు ధనుష్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ధనుష్ స్వయంగా అజయ్ భూపతిని పిలిపించుకుని కథ ఉంటే చెప్పమని అడిగినట్లు సమాచారం. దీంతో ధనుష్​ కోసం కథను చేయడంలో అజయ్ భూపతి బిజీగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తున్న 'మహా సముద్రం' సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదీ చూడండి:seetimaarr interview: గోపీచంద్​ను ఇమిటేట్ చేసిన నటి

ABOUT THE AUTHOR

...view details