తెలంగాణ

telangana

'రాధేశ్యామ్', 'భీమ్లా నాయక్' కొత్త రిలీజ్ డేట్స్ అవే!

By

Published : Jan 29, 2022, 8:42 AM IST

Radhe shyam release date: కరోనా వల్ల సినిమా రిలీజ్​ డేట్స్ ఎప్పటికప్పడు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే 'రాధేశ్యామ్', 'భీమ్లా నాయక్' కొత్త విడుదల తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Radhe Shyam and Bheemla Nayak
రాధేశ్యామ్ భీమ్లా నాయక్

Bheemla nayak new release date: ఒమిక్రాన్ ఎఫెక్ట్ వల్ల సంక్రాంతికి రావాల్సిన భారీ బడ్జెట్​ సినిమాలు వాయిదా పడ్డాయి. వాటిలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఆర్ఆర్ఆర్ గురించి ఇప్పటికే ప్రకటన వచ్చింది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

అయితే 'రాధేశ్యామ్​'ను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని, త్వరలో రిలీజ్​ డేట్​ కూడా ప్రకటిస్తామని ఇటీవల ఆ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ స్పష్టం చేశారు. ఓ అభిమాని ట్వీట్​కు సమధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మార్చి 4నే ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్​లో విడుదల కానుంది సమాచారం.

రాధేశ్యామ్ మూవీ

RRR movie: సంక్రాంతికి రావాల్సిన 'భీమ్లా నాయక్'.. 'ఆర్ఆర్ఆర్' కోసం పక్కకు తప్పుకొంది. ఫిబ్రవరి 25న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు అది కాస్త వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేసవి ప్రారంభంలో అంటే ఏప్రిల్ చివర్లో రానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరిన్ని తెలుగు సినిమాల కొత్త రిలీజ్​ డేట్స్ త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details