ETV Bharat / sitara

మూడు సినిమాలు, ఆరు టికెట్లు అనుకుంటే.. నిరాశే మిగిలెనే!

author img

By

Published : Jan 5, 2022, 4:09 PM IST

Sankranthi Movies 2021: సంక్రాంతి సీజన్​లో 'మూడు సినిమాలు.. ఆరు టికెట్లు' అని భావించిన సినీ అభిమానులకు నిరాశే మిగిలింది. సినీ ప్రియుల్ని ఎంతగానో ఊరించి పక్కకు తప్పుకొన్నాయి 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్'. ఈ చిత్రాల కారణంగా 'భీమ్లా నాయక్' కూడా వాయిదా పడింది. దీంతో ఇప్పుడు సంక్రాంతి సీజన్ పెద్ద సినిమాలు లేక కళ తప్పింది.

RRR
RRR

Sankranthi Movies 2021: సంక్రాంతి.. ఈ పేరుకు సినీ పరిశ్రమకు ఉన్న సంబంధం ప్రతి సినీ అభిమానికి తెలుసు. ప్రతి ఏడాది భారీ బడ్జెట్ సినిమాలు ఈ సీజన్​లో రిలీజ్ కావడానికి ప్రయత్నిస్తాయి. ఆర్నెళ్ల ముందుగానే అందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటాయి. 2020లో 'అల వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు సంక్రాంతి సీజన్​ను సందడిగా మార్చాయి. గతేడాది రవితేజ 'క్రాక్​'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కొద్ది రోజుల వరకు ఈ సీజన్​ కూడా ఎంతో భారీతనంతో కనిపించింది. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్​ చిత్రాలు పండక్కు వచ్చేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాయి. కటౌట్లు, బ్యానర్లు రెడీ అయ్యాయి. బెనిఫిట్ షో, ఫస్ట్ షో చూసేందుకు ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అంతలోనే 'ఆర్ఆర్ఆర్' పండగ బరిలో దిగింది.

ఆర్ఆర్ఆర్ వచ్చింది.. ప్లాన్ మారింది

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RRR Postpone: మొదట గతేడాది దసరాకు విడుదల చేస్తామని 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం ప్రకటించింది. దీంతో సంక్రాంతి సీజన్​ను ఫిక్స్ చేసుకున్నాయి 'భీమ్లా నాయక్', 'రాధేశ్యామ్'. మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అప్పటికే ఈ సీజన్​లో కర్చిఫ్ వేసింది. దీంతో ముగ్గురు స్టార్ హీరోలు సంక్రాంతికి వస్తుండటం అభిమానులను సర్​ప్రైజ్ చేసింది. కానీ అనివార్య కారణాల వల్ల 'ఆర్ఆర్ఆర్' అక్టోబర్ విడుదల వాయిదా పడింది. కొద్దిరోజుల్లోనే సంక్రాంతికి తమ చిత్రం వస్తుందంటూ ప్రకటించింది. ఆ సమయంలోనే 'సర్కారు వారి పాట' ఏప్రిల్​కు షిఫ్ట్ అయ్యింది. ఇక మిగిలింది 'భీమ్లా నాయక్', 'రాధేశ్యామ్'. అందులో రెండు పాన్ ఇండియా చిత్రాలు. దీంతో 'భీమ్లా నాయక్' వాయిదా అనివార్యమైంది.

ఒమిక్రాన్​తో ఉన్న ఆశలు ఆవిరి

Radheshyam postponed: 'రాధేశ్యామ్', 'ఆర్ఆర్ఆర్' నిర్మాతల విన్నపంతో 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. ఇక రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. 'రాధేశ్యామ్' చిత్రబృందం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఖర్చుతో ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందంమైతే దేశంలోని టాప్ సిటీల్లో ఈవెంట్లు ప్లాన్ చేసింది. ముంబయి, చెన్నై, తిరువనంతపురంలో ఈవెంట్లు పూర్తి చేసింది. అందుకోసం భారీగా ఖర్చు చేసింది. ఇక అంతా సవ్యమే అనుకుంటున్న సమయంలో ఒమిక్రాన్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరగడం వల్ల దిల్లీలో థియేటర్లు మూతపడ్డాయి. చాలా రాష్ట్రాల్లో రాత్రి కర్ప్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కర్ణాటక, తమిళనాడు కూడా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల మంచిది కాదని భావించిన 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ వాయిదా వేసుకుంది. తాజాగా బుధవారం తమ చిత్రాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు 'రాధేశ్యామ్' చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో సంక్రాంతి బరిలో పెద్ద సినిమా ఊసే లేకుండా పోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చిన్న సినిమాల జోరు

'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వాయిదా పడటం వల్ల చిన్న సినిమాలు సంక్రాంతి సీజన్​పై కన్నేశాయి. మొదటి నుంచి ఈ సీజన్​పైనే ఆశలు పెట్టుకున్న నాగార్జున 'బంగార్రాజు' మాత్రం దర్జాగా ఈ పండగ బరిలో దిగుతోంది. దీంతో పాటు 'డీజే టిల్లు'(జనవరి 14), 'హీరో'(జనవరి 15), 'సూపర్​మచ్చి'(జనవరి 14) విడుదల తేదీలను ఖరారు చేయగా.. 'రౌడీబాయ్స్', '7 డేస్ 6 నైట్స్' చిత్రాలు.. సంక్రాంతి రిలీజ్​ అని పోస్టర్లు రిలీజ్ చేశాయి. వీటితో పాటు తమిళ చిత్రాలు అజిత్ 'వాలిమై', విశాల్ 'సామాన్యుడు' కూడా ఈ పండగకే థియేటర్లలోకి రానున్నట్లు తెలిపాయి. కానీ తమిళనాడులో థియేటర్లు మూతపడటం వల్ల ఈ రెండు చిత్రాలు కూడా వాయిదాకే మొగ్గుచూపే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: 2022.. రెండో 'భాగ' నామ సంవత్సరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.